ఆర్.బి.ఐ/2018-19/147
ఎఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నo.16/02.01.001/2018-19.
మార్చి 25, 2019
ది చైర్మెన్ / మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
యస్.యల్.బి.సి/యుటియల్బిసి కన్వీనర్ బ్యాంకులు.
మేడమ్/డియర్ సర్,
యస్.యల్.బి.సి/యుటియల్బిసి సంయోజకత్వ (కన్వీనర్ షిప్) బాధ్యతల అప్పగింత – గుజరాత్ రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ &
డయ్యు మరియు దాద్రా & నాగర్ హవేలీ
జనవరి 2, 2019 తేదీ భారత గెజిట్ నోటిఫికేషన్ జీ.యస్.ఆర్.2(ఈ) ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా తో విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ల విలీనం అధికారికంగా ప్రకటించబడింది. “ది అమాల్గమేషణ్ ఆఫ్ విజయా బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ విత్ బ్యాంక్ అఫ్ బరోడా స్కీం, 2019” గా పిలువబడే ఈ నోటిఫికేషన్, ఏప్రిల్ 01, 2019 తేదీ నుండి అమలులోకి వస్తుంది.
2. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, గుజరాత్ రాష్ట్ర యస్.యల్.బి.సి సంయోజకత్వ (కన్వీనర్ షిప్) బాధ్యతను మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ & డయ్యు మరియు దాద్రా & నాగర్ హవేలీ సంయోజకత్వ (కన్వీనర్ షిప్) బాధ్యతను బ్యాంక్ అఫ్ బరోడా కు కేటాయించాలని నిర్ణయించడంజరిగింది.
3. ఇతర రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంయోజకత్వ (కన్వీనర్ షిప్) బాధ్యతల్లో ఎటువంటి మార్పు లేదు.
మీ విధేయులు
గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |