ఆర్.బి.ఐ/2018-19/166
డిసియం(సిసి)నం.2482/03.39.01/2018-19.
ఏప్రిల్ 08, 2019
చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ / చీఫ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్
అన్ని బ్యాంకులు
మేడమ్/సర్,
కరెన్సీ చెస్ట్ కు ఉండవలసిన కనీస ప్రామాణికాలు
అక్టోబర్ 04, 2016 తేదీ ద్రవ్య విధాన ప్రకటన పేరా 15 లో చెప్పినట్టుగా, రిజర్వు బ్యాంకు కరెన్సీ రవాణా పై కమిటిని (సిసియం) (అధ్యక్షుడు: శ్రీ డి.కె. మొహంతి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్) ఏర్పాటు చేసింది. అత్యాధునిక సదుపాయాలతో విశాలమైన కరెన్సీ చెస్ట్ ల ఏర్పాటుకు బ్యాంకులను ప్రోత్సహించాలని మరియు చెస్ట్ బ్యాలెన్స్ పరిమితిని కనీసంగా ₹10 బిలియన్ ఉండేట్లు, రిజర్వు బ్యాంకు వారికి ఈ కమిటీ, మిగతా విషయాలతో పాటు, సిఫారసు చేసింది. తదనుగుణంగా, కొత్త కరెన్సీ చెస్ట్ (సిసిలు) లు ఏర్పాటు చేయడానికి ఈ క్రింద పేర్కొన్న కనీస ప్రామాణికాలు ఉండాలని నిర్ణయించబడింది:
-
స్ట్రాంగ్ రూమ్ / ఖజానా గది ఏరియా కనీసంగా 1500 చదరపు ఆడుగులు. కొండ ప్రాంతాలు / దుర్గమమైన ప్రదేశాలలో (కేంద్ర ప్రభుత్వంగాని/రాష్ట్ర ప్రభుత్వాలు గాని/ ఇతర అధికార సంస్థ చే గాని అర్ధనిర్ధారణ చేయబడినవైతే) ఉన్నవాటికి, స్ట్రాంగ్ రూమ్ / ఖజానా గది ఏరియా కనీసంగా 600 చదరపు ఆడుగులు.
-
రోజుకు 6,60,000 బ్యాంక్ నోట్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి. కొండ ప్రాంతాలు / దుర్గమమైన ప్రదేశాలలో ఉన్న చెస్ట్ అయితే రోజుకు 2,10,000 బ్యాంక్ నోట్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి.
-
ఆటోమేషన్ అవలంబనకై అనుకూలత మరియు ఐటి పరిష్కారాలను అమలు చేయగల సామర్థ్యం.
-
వాస్తవ పరిస్థితులు మరియు విచక్షణ తో రిజర్వు బ్యాంకు విధించే సహేతుకమైన పరిమితులకు లోబడి, ₹10 బిలియన్ల చెస్ట్ నిల్వ పరిమితి (చెస్ట్ బ్యాలెన్స్ లిమిట్).
-
నవంబర్ 14, 2008 తేదీ సర్కులర్ డిసియం (సిసి) నం.జి-18/03.39.01/2008-09 ద్వారా నిర్మాణక్రమం, మొదలగువానికి సంబంధించి జారీఅయిన వర్తమానపు సాంకేతిక నిర్దిష్టతలను పాటించడం.
2. కరెన్సీ చెస్ట్ లు ఏర్పాటు చేయాలని అభిలషించే బ్యాంకులు పైన పేర్కొన్న కనీస ప్రామాణికాల పాటింపునకు అనుగుణంగా హామీ ఇవ్వాలి.
3. కరెన్సీ చెస్ట్ లు ఏర్పాటుచేయడానికై యున్న అన్ని ఇతర నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవు.
మీ విధేయులు
(సంజయ్ కుమార్)
జనరల్ మేనేజర్ |