ఆర్.బి.ఐ/2018-19/186
డి.సి.యం (ప్లానింగ్) నం. 2845/10.25.007/2018-19.
మే 23, 2019
అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకుడు/
నిర్వాహక సంచాలకుడు /ముఖ్య కార్యనిర్వహణాధికారి
కరెన్సీ చెస్ట్ లు కలిగియున్నఅన్ని బ్యాంకులు
డియర్ సర్/మేడమ్
నాన్-కరెన్సీ చెస్ట్ బ్యాంకు శాఖలకు మెరుగైన సేవలకై ప్రోత్సాహకాలు
శీర్షిక లోని అంశంపై జనవరి 21, 2016 వ తేదీ నాటి మా సర్కులర్ ఆర్బీఐ/2015-16/293 డిసియం (యన్పిడి) నం.2564/09.40.02/2015-16 ను పరికించండి. నాన్-కరెన్సీ చెస్ట్ బ్యాంకు శాఖలు జమ చేసే నగదు మీద సేవా ఛార్జీలను ప్రతి వందనోట్ల ప్యాకెట్టుకు ప్రస్తుతం ఉన్న ₹ 5/- రేటు నుండి అధికతర రేటు వరకు, గరిష్టంగా ప్రతి వందనోట్ల ప్యాకెట్టుకు ₹ 8/- వరకు పెంచుకోవడానికి పెద్దవైన ఆధునిక కరెన్సీ చెస్ట్ లను అనుమతించాలని నిర్ణయించబడింది. ఈ ప్రయోజనం పొందడానికి, ఏప్రిల్ 08, 2019 వ తేదీ నాటి మా సర్క్యులర్ ఆర్బీఐ/2018-19/166 డిసియం (సిసి) నం.2482/03.39.01 /2018-19 లో వివరించిన విధంగా కరెన్సీ చెస్ట్ కనీస ప్రమాణాలను పాటించే కరెన్సీ చెస్ట్ మాత్రమే పెద్దదైన ఆధునిక కరెన్సీ చెస్ట్ గా వర్గీకరింపడానికి అర్హత పొందుతుంది.
2. ఇటువంటి వర్గీకరణo కొరకై బ్యాంకులు వారి సంబంధిత అధికార పరిధి రిజర్వు బ్యాంకు జారీ (ఇష్యూ) ఆఫీస్ ను సంప్రదించవచ్చు. సంబంధిత జారీ ఆఫీస్ చే వర్గీకరణ పొందిన తరువాతే, పెరిగిన రేట్లను చార్జి చేయవచ్చు. పెరిగిన రేట్ల అనువర్తింపును కనీసం 15 దినాలు ముందుగానే పెద్దదైన ఆధునిక కరెన్సీ చెస్ట్ తో జోడింపబడిన అటువంటి నాన్-చెస్ట్ బ్యాంకు శాఖలకు తెలియజేయాలి.
మీ విధేయులు
(సంజయ్ కుమార్)
జనరల్ మేనేజర్ |