ఆర్.బి.ఐ/2018-19/190
డిబిఆర్.ఏయంయల్.బీసీ.నం.39/14.01.001/2018-19.
మే 29, 2019
ది చైర్-పర్సన్ లు/ అన్ని నియంత్రిత ఎంటిటీల సీఈఓ లు
డియర్ సర్ / మేడమ్,
కెవైసి మీది మాస్టర్ డైరెక్షన్ (యండి) కు సవరణ
ఫిబ్రవరి 13, 2019 వ తేదీ నాటి గెజెట్ నోటిఫికేషన్ జి.యస్.ఆర్.108 (ఈ) ద్వారా భారత ప్రభుత్వం నగదు అక్రమ చలామణి నియంత్రణ (రికార్డుల నిర్వహణ) నియమాలు, 2005 నకు సవరణలను ప్రకటించింది. అంతేగాకుండా, ప్రభుత్వం వొక అత్యవసరఆదేశం “ఆధార్ మరియు ఇతర చట్టాలు (సవరణ) అత్యవసరఆదేశం, 2019” ను ప్రకటించింది, దీనిద్వారా, ఇతరవిషయాలతోపాటు, నగదు అక్రమ చలామణి నివారణ చట్టం, 2002 ను సవరించింది.
2. పైన పేర్కొన్న సవరణలకు అనుగుణంగా మాస్టర్ డైరెక్షన్ (యండి) లో చేసిన ప్రధానమైన మార్పులు ఈ క్రింద జాబితా లో ఇవ్వబడ్డాయి:
a) గుర్తింపు ప్రయోజనం కోసం తన ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా ఉపయోగించే వ్యక్తి యొక్క ఆధార్ ప్రామాణీకరణ / ఆఫ్‌లైన్ ధృవీకరణను నిర్వహించడానికి బ్యాంకులు అనుమతించబడ్డాయి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 16}
b) అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాల (OVD) జాబితా లో ‘ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు’ చేర్చబడింది; షరతుఏమిటంటే, ఎక్కడైతే కస్టమర్ ‘ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు’ ను OVD రూపేణా దాఖలు చెద్దాం అనుకుంటాడో, అతను దానిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన వాటి రూపంలోనే సమర్పించవచ్చు {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 3} .
c) “వ్యక్తులయిన” కస్టమర్ ల గుర్తింపు కోసం అయితే,
-
ఆధార్ చట్టం, 2016 (విత్తపరంగా మరియు అన్య రాయితీ, లబ్ది లేదా సేవలను వితరణ చేయడమే లక్ష్యంగా) సెక్షన్ 7 క్రింద నోటిఫై అయిన పథకం దేనిక్రింద అయినా ఏదైనా లభ్ది గాని రాయితీని గాని పొందాలనుకొనే వ్యక్తి కస్టమర్ అయితే; తాను ఆధార్ చట్టం, 2016 క్రింద లభ్దిని గాని రాయితీని గాని పొందాలనుకుంటున్నాననే వారి డిక్లరేషన్ ఆధారం తో, బ్యాంకు ఆ కస్టమర్ నుండి ఆధార్ ను పొందగలిగి వారి ఈ-కేవైసి ధృవీకరణను నిర్వహించాలి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 16}
-
డిబిటి లబ్దిదారులు గాని కస్టమర్లు అయితే, నియంత్రిత ఎంటిటీలు (REలు) అటువంటి కస్టమర్ల నుండి వారి ఇటీవలి ఛాయాచిత్రo (ఫొటోగ్రాఫ్) తోపాటుగా; చిరునామా మరియు గుర్తింపు వివరాలు గల్గిన ఒక సర్టిఫైడ్ OVD డాక్యుమెంట్ దేన్నయినా పొందాలి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 16}
d) కస్టమర్ డ్యూ-డెలిజెన్స్ ప్రక్రియలో కస్టమర్ (డిబిటి-లబ్దిదారు-గాని-కస్టమర్) ఆధార్ ను సమర్పిస్తున్నప్పుడు, సవరించిన PML రూల్స్, రూల్ 9 సబ్-రూల్ 16 ప్రకారం ఆ కస్టమర్ వారి ఆధార్ నంబర్ ను రేడెక్ట్ గాని (అంటే నంబర్ ను గుర్తించలేని విధంగా జేయడం) బ్లాక్-అవుట్ (డార్క్ గా జేయడం) చేసాడని నియంత్రిత ఎంటిటీలు (REలు) నిర్ధారించాలి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 16}
e) బ్యాంకులు గానటువంటి నియంత్రిత ఎంటిటీలు (REలు) వారి కస్టమర్ లను ఆధార్ చట్టం క్రింద వారి (అతను/ఆమె) ఇష్టతతో ఆఫ్-లైన్ నిర్ధారణ ద్వారా గుర్తించాలి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 16}
f) ఒకవేళ క్లయింటు సమర్పించిన OVD లో తాజా చిరునామా లేకపోతే; మూడుమాసాల లోపున ఇప్పటి చిరునామా గల తాజా OVD సమర్పించగలిగితే, చిరునామా రుజువు కోసం మాత్రమే చూపించదగ్గ కొన్ని నిశ్చితమైన OVD లు ఇస్తే సరిపోతుంది. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 3 (a) ix}
g) వ్యక్తులు గానటువంటి కస్టమర్ ల గుర్తింపు కోసం అయితే; ఎంటిటీల సంబంధిత డాక్యుమెంట్ లతోపాటు వారి (కంపెనీలు మరియు భాగస్వామ్య సంస్థ లకు – PAN మాత్రమే) PAN నంబర్ గాని ఫారం నం.60 ని గాని పొందగలగాలి. సాధికార సంతకందార్ల PAN నంబర్/ఫారం నం.60 ని కూడా పొందగలగాలి. (సెక్షన్ 30 – 33)
h) వర్తమానపు బ్యాంక్ ఖాతాదారుల కోసం అయితే; గవర్నమెంట్ చే నోటిఫై చేయబడిన కాలవ్యవధి లోపున PAN నంబర్ గాని ఫారం నంబర్ 60 ని గాని వారు దాఖలుజేయాలి. లేనిచో PAN నంబర్ గాని ఫారం నంబర్ 60 ను గాని దాఖలుచేసేవరకు ఖాతాను తాత్కాలికoగా స్తంభింపజేయాలి. అయితే, బ్యాంకు అకౌంట్ లావాదేవిలను తాత్కాలికoగా స్తంభింపజేయాలని నిశ్చయించితే, ముందుగా నియంత్రిత ఎంటిటీలు (REలు) ఆ ఖాతాదారుడు తనకుదగ్గ వివరణ ఇచ్చేటందులకు తగిన అవకాశాన్ని మరియు అందుబాటులో నోటీసును ఇవ్వగలగాలి. {కెవైసి మీద సవరించిన మాస్టర్ డైరెక్షన్ (యండి) లోని సెక్షన్ 39}
3. ఇంతేగాకుండా, ప్రవాస భారతీయులు (NRIs) మరియు భారత సంతతి వ్యక్తులయిన (PIOs) కస్టమర్ల OVD లను సర్టిఫై చేయడానికిగాను అదనంగా సర్టిఫైచేసే అధికారులను మాస్టర్ డైరెక్షన్ సెక్షన్ 3(a)(v) నందు నిర్దిష్టం చేయబడింది.
4. ఎగువన పేర్కొన్న సవరణల ద్వారా వచ్చిన మార్పులను ప్రతిబింబించే విధంగా ఫిబ్రవరి 26, 2016 వ తేదీ నాటి కెవైసి పై మాస్టర్ డైరెక్షన్ తగురీతిలో నవీకరించబడింది అంతేగాకుండా తక్షణమే ఈ డైరెక్షన్ అమల్లోకి వస్తుంది.
మీ విధేయులు
(డా. యస్. కె. కార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |