ఆర్.బి.ఐ/2018-19/214
డి.సి.యం (ప్లానింగ్) నం. 2968/10.25.007/2018-19.
జూన్ 14, 2019
అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/
ముఖ్య కార్యనిర్వహణాధికారి
అన్ని బ్యాంకులు
మేడమ్ / డియర్ సర్,
ఎటిఎంల నిర్వహణ కై భద్రతాపరమైన చర్యలు
అక్టోబర్ 04, 2016 వ తేదీ నాటి ద్రవ్య విధాన ప్రకటన యందలి పేరా 15 నందు ఉద్ఘాటించినట్లు, ఖజానా బట్వాడా పరిగమనంలో ఇమిడియున్న సమస్త భద్రతా అంశాలను సమీక్షించుటకై ఆర్బీఐ “నగదు రవాణా మీద కమిటీ” (శ్రీ డి.కె.మొహంతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధ్యక్షతన) వొకదానిని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించడం జరిగింది, మరియు ఎటియం నిర్వహణ లో ఇమిడియున్న రిస్కును నివారించి వాటి భద్రతను మెరుగుపరచేందుకై సూచింప బడ్డ చర్యలలో కొన్నిoటిని ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
అ) అన్ని ఎటియం లలో నగదు భర్తీ డిజిటల్ వన్-టైం కాంబినేషన్ లాక్ తోనే నిర్వహించాలి.
ఆ) పెక్కు నిఘానేత్రాల పర్యవేక్షణలో మరియు కేంద్ర లేదా రాష్ట్ర భద్రతా బలగాల మోహరింపు గల్గిన విమానాశ్రయాల లాంటి అత్యంత సురక్షితమైన ప్రదేశాలలోఉన్న ఎటియం లు తప్ప మిగతా అన్ని ఎటిఎం లను సెప్టెంబర్ 30, 2019 వ తేదీ లోపున ఒక స్ట్రక్చర్ కు (గోడకు , పిల్లర్ కు లేదా నేలకు) ధృఢoగా బిగించాలి.
ఇ) సకాలంలో హెచ్చరికలు జేయడం మరియు వేగంగా ప్రతిక్రియ జరపడానికి ఏటీఎంల వద్ద సమగ్ర ఇ-నిఘా యంత్రాంగాన్ని రూపొందించడానికై బ్యాంకులు దిశానిర్దేశం చేయవచ్చు.
2. ఆర్బీఐ మరియు చట్టాన్నిఅమలుపరచడానికై ఉన్న ఇతర ఏజెన్సీలు జారీచేసిన ఇప్పటి నిబంధనలు, మేలిమి వాడుకలు మరియు మార్గదర్శకాలకు తోడు పైనుటంకించిన చర్యలను అమలుజేయాలి. కాల క్రమాలను అతిక్రమించడం గాని అమలబరచకపోవడం లాంటి వాటిపై పెనాల్టి తో సహా నియంత్రణ చర్యలు తీసుకోబడతాయి.
మీ విధేయులు
(అజయ్ మిచ్యారీ)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |