ఆర్.బి.ఐ/2018-19/218
యఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నం.19/02.08.001/2018-19.
జూన్ 20, 2019
ది చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.
మేడమ్/డియర్ సర్,
తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
తెలంగాణా ప్రభుత్వం, ఫిబ్రవరి 16, 2019 వ తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ జి.ఓ.యం.యస్. నం.18 మరియు 19 ల ద్వారా రెండు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 29, 2018 వ తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ నం. యఫ్-1-9-2018-VII-6 ద్వారా వొక జిల్లా ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది:
క్రమ సంఖ్య |
రాష్ట్రం |
క్రొత్తగా మలిచిన జిల్లా |
ఇదివరకటి జిల్లా |
క్రొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల పరిధిలోని రెవెన్యూ డివిజన్/తహసిల్ లు |
బాధ్యతలు అప్పగించబడిన లీడ్ బ్యాంకు |
క్రొత్త జిల్లాకు కేటాయించిన ‘డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్’ |
1. |
తెలంగాణా |
ములుగు |
జయశంకర్ భూపాలపల్లి |
ములుగు రెవెన్యూ డివిజన్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00A |
2. |
తెలంగాణా |
నారాయణ్పేట్ |
మహబూబ్ నగర్ |
నారాయణ్పేట్ రెవెన్యూ డివిజన్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00B |
3. |
మధ్యప్రదేశ్ |
నివారి |
తికంఘర్ |
ప్రిత్విపూర్, నివారి మరియు ఓర్ఛ తహసిల్ లు |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00C |
2. ఇంకా, క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకుల బియస్ఆర్(BSR) నివేదికల కొరకై కేటాయించబడ్డాయి.
3. తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఇదివరకటి జిల్లాలు మరియు ఇతర జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలలో ఏ మార్పు లేదు.
మీ విధేయులు
గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |