ఆర్.బి.ఐ/2018-19/223
డి.సి.యం (యన్ఈ) నం. 3057/08.07.18/2018-19.
జూన్ 26, 2019
అధ్యక్షుడు మరియు నిర్వాహక సంచాలకుడు/
నిర్వాహక సంచాలకుడు/
ముఖ్య కార్యనిర్వహణాధికారి
అన్ని బ్యాంకులు
మేడమ్/ డియర్ సర్,
నాణేల స్వీకరణ
శీర్షిక మీది అంశంపై తేదీ ఫిబ్రవరి 15, 2018 నాటి మా సర్క్యులర్ డిసియం (ఆర్.యం.యం.టి) నం.2945/11.37.01/ 2017-18 మరియు కరెన్సీ నోట్లు మరియు నాణేల మార్పిడి సదుపాయం మీద తేదీ జులై 02, 2018 (జనవరి 14, 2019 న నవీకరించబడింది) నాటి మా మాస్టర్ సర్క్యులర్ డిసియం (యన్ఈ)నం.జీ-2/08.07.18/2018-19 లోని పేరా 1 (డి) వైపు మీ దృష్టి ని మళ్ళించండి. ఈ సర్క్యులర్ లలో బ్యాంకు శాఖలు ఏ ఒక్కటీ కానీ వారి కౌంటర్లలో తక్కువ డినామినేషన్ నోట్లు మరియు / లేదా సమర్పించిన నాణేలను తిరస్కరించగూడదని సలహా ఇవ్వబడింది.
2. అయినప్పటికీ, బ్యాంకు శాఖలు నాణేలను ఆమోదించకుండా ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేయడం గురించి రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదులు రావడం కొనసాగుతూనే ఉంది.
3. అందుచేత, కౌంటర్ల లో మార్పిడికి మరియు లావాదేవిల కోసం ఇచ్చిన మొత్తం అన్ని చిన్న డినామినేషన్ నాణేలను ఆమోదించాలని మీ అన్ని శాఖలను తక్షణమే ఆదేశించాలని మరియు ఈ సందర్భంగా వీటి అమలు ఖచ్చితంగా జరిగేలాచూడాలని మీకు మళ్ళీ సలహా ఇవ్వడమైనది.
మీ విధేయులు
(అజయ్ మిచ్యారీ)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |