ఆర్.బి.ఐ/2019-20/40
యఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నం.09/02.01.001/2019-20.
ఆగష్టు 13, 2019
ది చైర్మెన్/మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలుపుకుని)/
చిన్న ఋణాల బ్యాంకులు/చెల్లింపుల బ్యాంకులు.
మేడమ్/డియర్ సర్,
నేరుగా లబ్దిదారులకు బదిలీ (డిబిటి) పథకం – ఆచరణ
సాంఘిక సంక్షేమ ప్రయోజనాలను లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసే సౌలభ్యం కోసం ఆధార్ వాడకం గురించి మే 10, 2013 వ తేదీ నాటి సర్కులర్ ఆర్.పి.సి.డి. సీఓ. ఎల్.బి.యస్/బీసీ.నం.75/02.01.001/2012-13 మరియు జులై 9, 2013 వ తేదీ నాటి ఆర్.పి.సి.డి. సీఓ. ఎల్.బి.యస్/బీసీ.నం.11/02.01.001/2013-14 ను దయచేసి పరికించండి.
2. ఈ సందర్భంగా, సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా లభ్దిదారులకు బదిలీ చేయడంకోసం అర్హులైన లబ్దిదారులకు ఇప్పటికే ఉన్న వారి ఖాతాలు లేదా కొత్త ఖాతాలు తెరిచి వాటిని, ఆధార్ సంఖ్యలతో అనుసంధానం చేయడం ప్రత్యెక నిర్దేశం (మాస్టర్ డైరెక్షన్) - వినియోగదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) డైరెక్షన్, 2016 (మే 29, 2019 న నవీకరించబడినది) , సెక్షన్ 16 క్రింద నిబంధనల జాబితా మరియు అక్రమ నగదు చలామణి నివారణ (పియంయల్) రూల్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదని నిర్ధారించాలని బ్యాంకులకు సలహా ఇవ్వడమైనది.
3. పైన పేర్కొనబడిన మార్గదర్శకాలు ఇంతకు మునుపు “నేరుగా లబ్దిదారులకు బదిలీ (డిబిటి) పథకం – బ్యాంకు ఖాతాల తో ఆధార్ అనుసంధానం – వివరణ” విషయం మీద జనవరి 14, 2016 తేదీ న ఇవ్వబడిన సర్కులర్ యఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్/బీసీ.నం.17/02.01.001/2015-16 మార్గదర్శకాలకు మారుగా ఇవ్వబడ్డాయి.
మీ విధేయులు
గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |