Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (171.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/08/2019
ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ)

ఆర్.బి.ఐ/2019-20/31
డిసిబిఆర్.బిపిడి(పిసిబి/ఆర్సిబి) సర్క్యులర్.నం.02/13.01.000/2019-20.

ఆగష్టు 2, 2019

ముఖ్య కార్యనిర్వహణాధికారి
అన్ని ప్రాధమిక (అర్బన్) సహకార బ్యాంకులు
అన్ని రాష్ట్ర/కేంద్ర సహకార బ్యాంకులు

మేడమ్/డియర్ సర్,

ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ)

దయచేసి, శీర్షిక మీది అంశంపై ఆగష్టు 17, 2012 వ తేదీ నాటి మా సర్క్యులర్ యుబిడి. బిపిడి.నం.5/13.01.000/2012-13 మరియు ఆగష్టు 22, 2012 వ తేదీ నాటి ఆర్.పి.సి.డి సిఒ.ఆర్.ఆర్.బి.ఆర్సిబి.బిసి నం.24/07.38.01/2012-13 సర్క్యులర్ ను పరికించండి.

2. ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) వొక పొదుపు ఖాతాగా, అటువంటి ఖాతాలను కలిగి ఉన్నవారికి ఎటువండి చార్జీలు లేకుండా కొన్ని కనీస సేవలు అందించే ప్రాతిపదికన రూపొందించబడింది. ఖాతాదార్లకు మెరుగైన సేవలను అందించే దృష్టితో, ఈ ఖాతాలకున్న వొసగులకు కొన్ని మార్పులను తీసుకురావాలని నిర్ణయించబడింది. తదనుగుణంగా, కనీస నిల్వ అవసరం లేకుండానే బియస్బిడి ఖాతాలకు ఈ క్రింద సూచించబడిన కనీస ప్రాధమిక సేవలను ఎటువంటి చార్జీలు లేకుండా కల్పించాలని బ్యాంకులను ప్రస్తుతం ఆదేశించడం జరిగింది:-

అ) బ్యాంకు బ్రాంచితో పాటుగా ఏటియం/సీడియం లలో నగదు జమ చేయుటo ఉచితం.

ఆ) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు మరియు డిపార్టుమెంట్లు డ్రా చేసిన చెక్కులను సేకరించడం/జమచేయడం ద్వారా గాని ఎటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమo ద్వారాగాని నగదు ప్రాప్తి/వసూళ్లు;

ఇ) నెలలో ఎన్నిసార్లు, ఎంతమొత్తంలో అయినా బియస్బిడి ఖాతాల్లో డిపాజిట్లు చేయొచ్చు.

ఈ) నెలకు 4 సార్లు నగదు ఉపసంహరణకు అనుమతి, ఏటియం ఉపసంహరణలతో కలుపుకుని.

ఉ) ఏటియం కార్డు గాని ఎటియం/డెబిట్ కార్డు గాని ఉచితంగా అందించాలి.

బియస్బిడి ఖాతాను అందరికి అందుబాటులోయున్న మామూలు బ్యాంకింగ్ సేవ గానే పరిగణించాలి.

3. ప్రస్తుతం బేసిక్ ఖాతాలకు అమలవుతున్న సేవలకు అదనంగా చెక్ బుక్ వంటి మరిన్ని సేవలను బ్యాంకులు అందించవచ్చు, వాటికి చార్జీలు ఉన్నాయో లేదో అనేది బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ అదనపు సేవలు ఖాతాదార్ల ఇష్టతతో మాత్రమే వారికి అందించవచ్చు. ఈ సదుపాయాలు కల్పించాము కనుక, ఖాతాలలో కనీస నగదు నిల్వ చేయాలని ఖతాదార్లపై బ్యాంకులు ఒత్తిడి చేయకూడదు. ఈ అదనపు సేవలు అందించినంతమాత్రాన అవి బియస్బిడి ఖాతాలు కాకుండా పోవు. అందువల్ల ఎంతకాలమైనా ఉచిత కనీస సేవలు ఆ ఖాతాలకు అమలు కావాల్సిందే.

4. అదే బ్యాంకులో మరే ఇతర సేవింగ్స్ బ్యాంకు ఖాతాను తెరవడానికి బియస్బిడి ఖాతాదార్లు అర్హులు గారు. ఒకవేళ ఇపుడున్న బ్యాంకులో మరే ఇతర సేవింగ్స్ బ్యాంకు ఖాతాఐనా కస్టమర్ నకు ఉన్నట్లయితే, బియస్బిడి ఖాతా తెరిచిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపున ఆ ఖాతాను మూయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, బియస్బిడి ఖాతా తెరిచే ముందుగా బ్యాంకు ఆ కస్టమర్ నుండి మరే ఇతర బ్యాంకుల్లోగూడ ఆయనకు/ఆమెకు బియస్బిడి ఖాతా లేదని ద్రువపత్రం తీసుకోవాలి.

5. ఫిబ్రవరి 25, 2016 తేదీ న ఆర్బీఐ చే “మాస్టర్ డైరెక్షన్- మీ వినియోగదారుని తెలుసుకోండి (కేవైసి) నిర్దేశం 2016” రూపేణా మాస్టర్ డైరెక్షన్ డిబిఆర్.ఏయంయల్.బిసి.నం.81/14.01.001/2015-16 సర్కులర్ ద్వారా జారీఅయి కాలక్రమంలో సవరణబొంది, బ్యాంకు ఖాతాలు తెరవడానికై ఉన్నటువంటి ఆర్బీఐ కేవైసి/ఏయంయల్ నిబంధనలకు బియస్బిడి ఖాతా అనేది లోబడి ఉండాలి.

6. సాధారణ బ్యాంకు ఖాతాలకు వారి బ్యాంకు ఏటియం లేదా ఇతర బ్యాంకు ఏటియం ల నుండి జరిపే ఉచిత లావాదేవీలపై ఆగష్టు 14, 2014 తేదీ నాటి సర్కులర్ డిపియస్యస్.సిఓ.పిడి.నం.316/02.10.002/2014-15 మరియు అక్టోబర్ 10, 2014 తేదీనాటి సర్కులర్ డిపియస్యస్.సిఓ.పిడి.నం.659/02.10.002/2014-15 ల ద్వారా జారీ అయిన నిబంధనలు ఈ బియస్బిడి ఖాతాలకు వర్తింపవు. బియస్బిడి ఖాతాదార్లు వారి సొంత బ్యాంకు ఏటియం లేదా ఏ బ్యాంకు ఏటియం ద్వారానైనా పరిమితకనిష్టసంఖ్యవరకు చార్జిలులేకుండా నగదును విత్-డ్రా చేయొచ్చు.

7. గతంలో, “ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) శీర్షిక మీద” ఆగష్టు 17, 2012 తేదీ నాటి సర్కులర్ యుబిడి.బిపిడి.నం.5/13.01.000/2012-13 మరియు ఆగష్టు 22, 2012 తేదీ నాటి సర్కులర్ ఆర్.పి.సి.డి.సిఓ.ఆర్ఆర్బి. ఆర్సిబి.బిసి.నం.24/07.38.01/2012-13 ద్వారా, ఆ తరువాత “ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) - తరచూ అడిగే ప్రశ్నలు శీర్షిక మీద” సెప్టెంబర్ 17, 2013 తేదీ నాటి సర్కులర్ నం. ఆర్.పి.సి.డి..ఆర్ఆర్బి. ఆర్సిబి.ఏయంయల్ బిసి.నం.36/ 07.51.018/2013-14 మరియు అక్టోబర్ 31, 2013 తేదీ నాటి సర్కులర్ యుబిడి.బిపిడి(పిసిబి).నం.35/13.01.000/2013-14 ద్వారా, జారీ ఆయిన నిబంధనలను ఈ సర్కులర్ అధిక్రమితం చేస్తున్నది.

8. ఈ నిబంధనలు సెప్టెంబర్ 01, 2019 వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ సందర్భంగా తగు వ్యవస్థను మరియు విధి విధానాలను బోర్డు ఆమోదంతో యేర్పరచాలని బ్యాంకులకు సలహా ఇవ్వడమైనది.

మీ విధేయులు

(నీరజ్ నిగమ్)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….