ఆర్.బి.ఐ/2019-20/94
యఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్.బీసీ.నం.14/02.08.001/2019-20.
నవంబర్ 08, 2019
ది చైర్మెన్ / మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.
మేడమ్/డియర్ సర్,
మిజోరాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
మిజోరాం ప్రభుత్వం, సెప్టెంబర్ 12, 2008 తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ నం.ఏ.60011/21/95-జిఏడి/పిటి ద్వారా మూడు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మరియు జులై 4, 2019 మరియు ఆగష్టు 9, 2019 తేదీలతో సంబంధిత నోటిఫికేషన్లను ప్రకటించారు. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది:
క్రమ సంఖ్య |
క్రొత్తగా మలిచిన జిల్లా |
ఇదివరకటి జిల్లా(లు) |
బాధ్యతలు అప్పగించబడిన లీడ్ బ్యాంకు |
క్రొత్త జిల్లాకు కేటాయించిన ‘డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్’ |
1. |
సైతుఅల్ |
(i) ఐజోల్
(ii) చంఫాయి |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00E |
2. |
ఖ్వాజాల్ |
(i) చంఫాయి
(ii) సేర్చ్చిప్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00G |
3. |
హనాతియల్ |
ళంగ్లేయి |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
00F |
2. ఇంకా, క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకులు వారి బియస్ఆర్ (BSR) నివేదించుట కోసమై కేటాయించబడ్డాయి.
3. మిజోరాం రాష్ట్రంలోని ఇదివరకటి జిల్లాలు మరియు ఇతర జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలలో ఏ మార్పు లేదు.
మీ విధేయులు
గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |