ఆర్‌బిఐ/2020-21/28 DoR (PCB).BPD.Cir.No.2/12.05.001/2020-21
ఆగస్టు 26, 2020
ముఖ్య కార్యనిర్వాణ అధికారి
అన్ని ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు
మేడమ్/ప్రియమైన సర్,
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 31 క్రింద రిటర్న్స్ సమర్పించడం - సమయం పొడిగింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (“చట్టం”) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 31 ప్రకారం [బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) ఆర్డినెన్స్, 2020 చే సవరించబడినది], సెక్షన్ 29 లో సూచించిన ఖాతాలు మరియు ఆడిటర్ నివేదికతో కూడిన బ్యాలెన్స్ షీట్, ఈ చట్టం నిర్దేశించిన పద్ధతిలో ప్రచురించబడుతుంది మరియు దాని యొక్క మూడు కాపీలు భారతీయ రిజర్వు బ్యాంకుకు వారు సూచించిన కాలం ముగిసినప్పటి నుండి మూడు నెలల్లోపు రిటర్న్ గా సమర్పించాలి. పైన ఉదహరించిన మొదటి నిబంధన ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు ఏ సందర్భంలోనైనా అటువంటి రిటర్న్ సమర్పించడానికి మూడు నెలల వ్యవధిని మరో మూడు నెలలు మించకుండా పొడిగించవచ్చు.
2. పైన పేర్కొన్న ఆర్డినెన్స్ సవరణ, ఇతరత్రాలతో సెక్షన్ 31 కలిపి, జూన్ 29, 2020 న ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులకు (యుసిబి) నోటిఫై చేయబడింది. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సందర్బంగా, యుసిబిలు రిటర్న్ సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పైన పేర్కొన్న రిటర్న్ సమర్పించడానికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరం అని భావించబడింది.
3. పైన పేర్కొన్నదానిని దృష్టిలో ఉంచుకుని, మార్చి 31, 202న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 31 క్రింద రిటర్న్ సమర్పించడానికి మూడు నెలల వ్యవధిని మరో మూడు నెలల కాలానికి, భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది. దీని ప్రకారం, అన్ని యుసిబిలు సెప్టెంబర్ 30, 2020న లేదా అంతకు ముందు రిజర్వ్ బ్యాంకుకు పైన పేర్కొన్న రిటర్న్ సమర్పించేలా చూసుకోవాలి.
మీ విధేయులు,
(నీరజ్ నిగం)
చీఫ్ జనరల్ మేనేజర్ |