ఆర్‌బిఐ/2020-21/17
DoR.No.BP.BC/4/21.04.048/2020-21
ఆగస్టు 6, 2020
అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)
అన్ని ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/అఖిల భారత ఆర్థిక సంస్థలు/అన్ని బ్యాంకింగేతర సంస్థలు
మేడమ్/ ప్రియమైన సర్,
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం – అడ్వాన్సుల పునర్వ్యస్థీకరణ
ఫై అంశంపై ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్ DoR.No.BP.BC.34/21.04.048/2019-20 చూడండి.
2. కోవిడ్ 19 మూలంగా, ఆచరణీయమైన ఎంఎస్‌ఎంఇ ఎంటిటీలకు మద్దతు ఇవ్వడం మరియు ఈ మార్గదర్శకాలను కోవిడ్ 19 కోసం రిజల్యూషన్ ఫ్రేంవర్క్ తో అనుసంధానించడం -ఇతర అడ్వాన్సుల కోసం ప్రకటించిన సంబంధిత ఒత్తిడి మొదలగు వాటికై, పైన పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం అనుమతించిన పథకాన్ని పొడిగించాలని నిర్ణయించడమైనది. దీని ప్రకారం, ' ప్రామాణికంగా’ వర్గీకరించబడిన ఎంఎస్‌ఎంఇ లకు ఉన్న రుణాలు ఈ క్రింది షరతులకు లోబడి ఆస్తి వర్గీకరణలో డౌన్గ్రేడింగ్ లేకుండా పునర్వ్యస్థీకరించబడతాయి:
-
బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ద్వారా రుణగ్రహీతకు, మొత్తం ఎక్స్పోజర్, నిధులేతర సదుపాయాలతో సహా, మార్చి 1, 2020 నాటికి ₹ 25 కోట్లు మించకూడదు.
-
మార్చి 1, 2020 నాటికి రుణగ్రహీత ఖాతా ‘ప్రామాణిక ఆస్తి’ గా ఉండాలి.
-
రుణగ్రహీత ఖాతా యొక్క పునర్వ్యస్థీకరణ మార్చి 31, 2021 నాటికి అమలు చేయాలి.
-
రుణాలు తీసుకునే సంస్థ పునర్వ్యస్థీకరణ అమలు తేదీన జిఎస్‌టి-నమోదు చేయబడి ఉండాలి. అయితే, జిఎస్‌టి-నమోదు నుండి మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఇలకు ఈ షరతు వర్తించదు. మార్చి 1, 2020 నాటికి మినహాయింపు పరిమితి ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది.
-
ప్రామాణికంగా వర్గీకరించబడిన రుణగ్రహీతల యొక్క ఆస్తి వర్గీకరణను అలాగే ఉంచవచ్చు, అయితే మార్చి 2, 2020 మరియు అమలు తేదీ మధ్య ఎన్‌పిఎ వర్గంలోకి జారిపోయిన ఖాతాలను అమలు చేసిన తేదీ నాటికి 'ప్రామాణిక ఆస్తి'గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ సర్క్యులర్ యొక్క నిబంధనల ప్రకారం పునర్వ్యస్థీకరణ జరిగితేనే, ఆస్తి వర్గీకరణ ప్రయోజనం లభిస్తుంది.
-
ఇంతకు ముందు విధంగా, ఈ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యస్థీకరణ జరిగిన ఖాతాల కోసం, బ్యాంకులు తమ వద్ద ఇప్పటికే ఉన్న ప్రొవిజన్స్ కంటే 5% అదనపు ప్రొవిజన్లను ఏర్పరచుకోవాలి.
3. ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న అన్ని ఇతర సూచనలు వర్తిస్తాయి.
మీ విధేయులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |