ఆర్‌బిఐ/2020-21/19 DoR.No.BP.BC/6/21.04.048/2020-21
ఆగస్టు 6, 2020
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)
మేడమ్/ప్రియమైన సర్,
వ్యవసాయేతర తుది ఉపయోగాల కోసం బంగారు నగలు మరియు ఆభరణాలఫై రుణాలు
దయచేసి జూలై 22, 2014 నాటి DBOD.No.BP.BC.27/21.04.048/2014-15 మరియు ఫిబ్రవరి 16, 2017 నాటి DBR.RRB.BC.No.53/31.01.001/2016-17 సర్క్యులర్‌లను చూడండి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, బంగారు నగలు మరియు ఆభరణాలఫై బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు, బంగారు నగలు మరియు ఆభరణాల విలువలో 75 శాతానికి మించకూడదు.
2. గృహ కార్యకలాపాలు, ఔత్సాహికులు మరియు చిన్న వ్యాపారాలపై కోవిడ్-19 మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని మరింత తగ్గించే ఉద్దేశ్యంతో, బంగారు నగలు మరియు ఆభరణాలఫై రుణాల కోసం అనుమతించదగిన రుణ విలువ నిష్పత్తి (ఎల్‌టివి) పెంచాలని నిర్ణయించడమైనది. తదనుగుణంగా, వ్యవసాయేతర అవసరాలకు రుణ విలువ నిష్పత్తి (ఎల్‌టివి), 75 శాతం నుండి 90 శాతం వరకు పెంచాలని నిర్ణయించడమైనది. కోవిడ్-19 కారణంగా రుణగ్రహీతలు వారి తాత్కాలిక ద్రవ్య లభ్యత అసమతలను అధిగమించడానికి ఈ మెరుగైన ఎల్‌టివి నిష్పత్తి మార్చి 31, 2021 వరకు వర్తిస్తుంది. ఆవిధంగా, ఏప్రిల్ 1, 2021 తరువాత మంజూరు చేసిన తాజా బంగారు రుణాలు 75 శాతం ఎల్‌టివి నిష్పత్తి కలిగి ఉంటాయి.
3. పైన పేర్కొన్న సర్క్యులర్ల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
మీ విధేయులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |