RBI/2019-20/243
DOR.No.BP.BC.70/21.01003/2019-20
మే 23, 2020
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)
అయ్యా / అమ్మా,
భారీ మొత్తాల ‘ఎక్స్పోజర్’ కు సంబంధించిన వ్యవస్థ – పరస్పర సంబంధం కలిగిన కౌంటర్ పార్టీల సమూహంతోగల ఎక్స్పోజర్ పరిమితి పెంపు
పైన పేర్కొన్న విషయంపై, జూన్ 03, 2019 తేదీన జారీ చేసిన మా సర్క్యులర్ No. DBR.No.BP.BC.43/21.01.003/2018-19 దయచేసి చూడండి. సర్క్యులర్ లోని పేరా 5.2. ను అనుసరించి, పరస్పర సంబంధం కలిగిన ఒక కౌంటర్ పార్టీల సమూహంతోగల మొత్తం ఎక్స్పోజర్ ఏ సమయంలోనూ బ్యాంకు లభ్యతలోఉన్న, అర్హతగల మూలధనంలో 25% మించరాదు.
2. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ‘డెట్ మార్కెట్లు’, ఇతర ‘క్యాపిటల్ మార్కెట్లలో’ అనిశ్చితి అధికమౌతోంది. దీని ఫలితంగా, అనేక కార్పొరేట్ సంస్థలు, క్యాపిటల్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధులకొరకు బ్యాంకుల మీద ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితులలో, కార్పొరేట్ రంగానికి ఎక్కువ నిధులు సమకూర్చుటకు, పరస్పర సంబంధం కలిగిన ఒక కౌంటర్ పార్టీల సమూహంతోగల మొత్తం ఎక్స్పోజర్, అర్హతగల మూలధనంలో 25% నుండి 30%నికి, ఏక కాల చర్యగా, పెంచబడింది.
3. పెంచిన పరిమితి, జూన్ 30, 2021 వరకు అమలులో ఉంటుంది.
మీ విశ్వాసపాత్రులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్ |