RBI/2019-20/217
DOR.BP.BC.No.65/21.04.098/2019-20
ఏప్రిల్ 17, 2020
అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు మరియు చెల్లింపు బ్యాంకులు మినహా)
అమ్మా / అయ్యా,
ద్రవ్యత ప్రమాణాలపై (లిక్విడిటి స్టాండర్డ్స్) బాజెల్ III విధాన వ్యవస్థ – ‘లిక్విడిటి కవరేజ్ రేషియో (ఎల్ సి ఆర్)’
మా సర్క్యులర్ DBOD.BP.BC.No.120/21.04.098/2013-14 తేదీ జూన్ 9, 2014 తత్సంబంధిత ఇతర సర్క్యులర్లు దయచేసి చూడండి.
2. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభ సంస్కరణలలో (జి ఎఫ్ సి, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రిఫామ్స్) భాగంగా, బ్యాంకింగ్ పర్యవేక్షణపై బాజెల్ కమిటీ (బి సి బి ఎస్), లిక్విడిటి కవరేజ్ రేషియో (ఎల్ సి ఆర్) ప్రవేశపెట్టింది. తదనుసారంగా, బ్యాంకులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు, 30 రోజుల నికర వ్యయానికి సరిపోయిన ఉత్తమ శ్రేణి ద్రవ్యత గల ఆస్తులు (‘హై క్వాలిటీ లిక్విడ్ అసెట్లు’ ఎచ్ క్యూ ఎల్ ఏ) కలిగి ఉండవలెను.
ఇంతేగాక, భారతదేశంలోని బ్యాంకులు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 క్రింద చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ ఎల్ ఆర్) కొరకు, ద్రవ్యతగల ఆస్తులు కలిగి ఉండవలెను. ఎస్ ఎల్ ఆర్ మరియు ఎల్ సి ఆర్ క్రింద ఉండవలసిన ఎచ్ క్యూ ఎల్ ఏ స్ ఎక్కువ భాగం ఒకటేగనుక, ఎస్ ఎల్ ఆర్ సెక్యూరిటీలను అధికతమంగా ఎల్ సి ఆర్ క్రింద ఎచ్ క్యూ ఎల్ ఏ సెక్యూరిటీల వలె పరిగణించుటకు అంగీకరిస్తున్నాము. దీనితో, ఈరెండు అవసరాలకు ఒకే ఆస్తులను వినియోగించుకోవచ్చును.
3. ప్రస్తుతం శ్రేణి 1, ఉత్తమ శ్రేణి ద్రవ్యత గల ఆస్తుల (హై క్వాలిటీ లిక్విడ్ అసెట్లు) క్రింద (విధేయకంగా కలిగి ఉండవలసిన ఎస్ ఎల్ ఆర్ లో భాగంగా) రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన ప్రభుత్వ సెక్యూరిటీలు:
(i) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎమ్ ఎస్ ఎఫ్), (ii) ఫెసిలిటీ టు అవైల్ లిక్విడిటి ఫర్ లిక్విడిటి కవరేజ్ రేషియో (ఎఫ్ ఏ ఎల్ ఎల్ సి ఆర్) (ఏప్రిల్ 1, 2020 నుండి, బ్యాంక్ ఎన్ డి టి ఎల్ లో 15%). ఏప్రిల్ 11, 2020 నుంచి ఎస్ ఎల్ ఆర్, ఎన్ డి టి ఎల్ లో 18%నికి తగ్గించబడటం మరియు ఎమ్ ఎస్ ఎఫ్, బ్యాంకుల ఎన్ డి టి ఎల్ లో 2% నుండి 3%నికి పెంచడం (మార్చి 27, 2020 నుండి జూన్ 30, 2020 వరకు) కారణంగా ఎస్ ఎల్ ఆర్ కు అర్హతగల అన్ని ఆస్తులు, ఎల్ సి ఆర్ కొరకు ఉండవలసిన ఎచ్ క్యూ ఎల్ ఏ వలె పరిగణించబడతాయి.
4. ఇంతేగాక, జనవరి 1, 2019 నుండి, బ్యాంకులు 100 శాతం ఎల్ సి ఆర్ కలిగి ఉండవలెను. కోవిడ్-19 వ్యాధి కారణంగా బ్యాంకుల ద్రవ్య సరఫరా మీద పడ్డ భారం తగ్గించుటకు, బ్యాంకులు ఈక్రిందివిధంగా ఎల్ సి ఆర్ నిర్వహించుటకు అనుమతించబడింది:
సర్క్యులర్ తేదీనుండి సెప్టెంబర్ 30, 2020 |
80 శాతం |
అక్టోబర్ 1, 2020 నుండి మార్చ్ 1, 2021 |
90 శాతం |
ఏప్రిల్ 2021 నుండి |
100 శాతం |
పై ఎల్ సి ఆర్ పరిమితులకు భంగం కలిగితే పునరుద్ధరించుటకు బ్యాంకులు ప్రణాళిక తయారుచేయవలెను. దీనిని, రిజర్వ్ బ్యాంక్, పర్యవేక్షణ విభాగం పరిశీలిస్తుంది.
మీ విశ్వాసపాత్రులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్ |