RBI/2019-20/218
DOR.BP.BC.No.64/21.2.067/2019-20
ఏప్రిల్ 17, 2020
అన్ని వాణిజ్య మరియు సహకార బ్యాంకులు,
అమ్మా / అయ్యా,
బ్యాంకులచే డివిడెండ్ ప్రకటన
సర్క్యులర్ DBOD.No.BP.BC.88/21.02.067/2004-05, మే 4, 2005, మరియు సంబంధిత సర్క్యులర్లలోని మార్గదర్శకాలు పాటిస్తూ, డివిడెండ్ ప్రకటించుటకు, బ్యాంకులు అనుమతించబడ్డాయి.
2. కోవిడ్–19 కారణంగా ఎదురైన అనిశ్చిత పరిస్థితులలో, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చుటకు, నష్టాలు ఎదురైతే భరించుటకు, బ్యాంకులు, వారి మూలధనాన్ని పరిరక్షించకోవడం చాలా ముఖ్యం. తదనుగుణంగా, అన్ని బ్యాంకులు, మార్చి 31, 2020 న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన లాభాలపై, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు, డివిడెండ్ చెల్లించరాదని నిశ్చయించబడింది. సెప్టెంబర్ 30, 2020 త్రైమాసికంలో, బ్యాంకుల ఆర్థిక ఫలితాల ఆధారంగా ఈనిర్బంధం, సమీక్షించబడుతుంది.
మీ విశ్వాసపాత్రులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్ |