RBI/2019-20/208 A.P. (DIR Series) Circular No. 28
మార్చి 03, 2020
అన్ని ఆతరైజ్డ్ డీలర్ క్యాటగిరి – I బ్యాంకులకు
రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ – అత్యవసర పరిస్థితులలో
పౌర సహాయ సహకారాల కొరకు, ప్రధానమంత్రి నిధికి
చెల్లింపు (పి ఎమ్ కేర్స్) ఫండ్)
ఆతరైజ్డ్ డీలర్ క్యాటగిరి – I బ్యాంకులు, దయచేసి రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ (ఆర్ డి ఎ) సదుపాయం ద్వారా అనుమతించబడిన లావాదేవీలకు సంబంధించి, జనవరి 01, 2016 న జారీచేసిన “మాస్టర్ డైరెక్షన్ – నాన్ రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్ ద్వారా రుపీ / ఫారిన్ కరెన్సీ వోస్ట్రో అకౌంట్లు తెరచుట మరియు నిర్వహణ”, పేరాగ్రాఫ్ 4, చూడవలెను.
2. కోవిడ్–19 వ్యాధి విజృంభణ కారణంగా, భారత ప్రభుత్వంతో సంప్రదించి, నాన్-రెసిడెంట్లు “అత్యవసర పరిస్థితులలో పౌర సహాయ సహకారాల కొరకు ప్రధానమంత్రి నిధికి (పి ఎమ్ కేర్స్ – ఫండ్)”, నాన్-రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్ ద్వారా పంపించే విదేశీ మారక ద్రవ్య విరాళాలు, అంగీకరించవచ్చని నిర్ణయించడం జరిగింది. అయితే, ఆతరైజ్డ్ డీలర్, క్యాటగిరి I బ్యాంకులు, ఈసొమ్మును తిన్నగా నిధికి జమచేయాల్సి ఉంటుంది. ఇంతేగాక, నిధులు పంపినవారి పూర్తి వివరాలు నమోదుచేసి ఉంచవలెను.
3. “నాన్ – రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్ రుపీ / విదేశీ మారక వోస్ట్రో ఖాతాలు తెరచుట మరియు నిర్వహణ తేదీ జనవరి 01, 2016”, మాస్టర్ డైరెక్షన్లో తదనుసారంగా మార్పులు చేయబడతాయి.
4. ఈ సర్క్యులర్ లోని ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి.
మీ విశ్వాసపాత్రులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్ |