Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (264.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/03/2020
చట్టబద్ధ సంస్థగా గుర్తింపు {లీగల్ ఎంటిటీ ఐడెంటిఫయర్ (ఎల్ ఇ ఐ)}, - చివరి గడువు పొడిగింపు

RBI/2019-20/185
FMRD.FMID.No.24/11.01.007/2019-20

మార్చి 27, 2020

అర్హతగల అందరు మార్కెట్ భాగస్వాములకు,
అయ్యా / అమ్మా,

చట్టబద్ధ సంస్థగా గుర్తింపు {లీగల్ ఎంటిటీ ఐడెంటిఫయర్ (ఎల్ ఇ ఐ)},
- చివరి గడువు పొడిగింపు

నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో పాల్గొనుటకు ఎల్ ఇ ఐ అవసరమని నిర్దేశిస్తూ, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన సర్క్యులర్ FMRD.FMID.No.10/11.01.007/2018-19, నవంబర్ 29, 2018, దయచేసి చూడండి. మరియు, నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో ఎల్ ఇ ఐ అమలులోకివచ్చే తేదీలు సవరిస్తూ జారీచేసిన సర్క్యులర్ FMRD.FMID.No.15/11.01.007/2018-19, ఏప్రిల్ 26, 2019 కూడా చూడండి.

2. మార్కెట్ భాగస్వాముల స్పందన, అభ్యర్థనలు; నావెల్ కరొన డిసీజ్ (COVID-19) వల్ల ఉత్పన్నమయిన సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఇంకా, నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో ఫేజ్ III సులువుగా అమలుపరచుటకు, ఎల్ ఇ ఐ ఆచరణలోనికివచ్చే తేదీలు, ఈ క్రిందివిధంగా పొడిగించబడ్డాయి:

ఫేజ్ సంస్థయొక్క నికర సంపద ప్రస్తుత ముగింపు తేదీ పొడిగించిన ముగింపు తేదీ
ఫేజ్ III రూ. 200 కోట్ల వరకు మార్చి 31, 2020 సెప్టెంబర్ 30, 2020

3. ఈ నిర్దేశాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45 W (45 U తో కలిపి) క్రింద జారీచేయబడ్డాయి.

మీ విశ్వాసపాత్రులు,

(డింపుల్ భాండియా)
జనరల్ మానేజర్ ఇన్-చార్జ్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….