ఆర్‌బిఐ/2020-21/71
DPSS.CO.PD.No.752/02.14.003/2020-21
డిసెంబర్ 04, 2020
ది చైర్మెన్ / మేనేజింగ్ డైరెక్టర్ /ముఖ్య కార్య నిర్వహణాధికారి
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు / చెల్లింపుల బ్యాంకులు/చిన్న ఆర్ధిక బ్యాంకులు /లోకల్ ఏరియా బ్యాంకులతో కలుపుకుని,
ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలు జారీచేయు నాన్-బ్యాంక్ లు/
అధీకృత కార్డు చెల్లింపు యంత్రాంగం (నెట్వర్క్ లు)
మేడమ్/డియర్ సర్,
కాంటాక్ట్ లెస్ మోడ్ లో కార్డు లావాదేవీలు – అదనపుకారకం యొక్క ప్రామాణీకరణ ఆవశ్యకం సడలింపు.
దయచేసి, మే 14, 2015 తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) చే జారీ చేయబడ్డ సర్కులర్ DPSS.CO.PD. No.2163/02.14.003/2014-2015 ను చూడండి. ఇందులో పాయింట్స్ అఫ్ సేల్ (పిఓయస్) టెర్మినళ్ల వద్ద కాంటాక్ట్ లెస్ మోడ్ లో కార్డు లావాదేవీలు జరిపేందుకు, లావాదేవీ విలువ ₹ 2,000/- ల వరకు ఉన్న అదనపుకారకం యొక్క ప్రామాణీకరణ (ఎఎఫ్ఎ-AFA) ఆవశ్యకం సడలించ బడింది. తదనంతరం, ఈ పరిమితికి మించిన లావాదేవీలను కాంటాక్ట్‌లెస్ మోడ్‌లో ప్రాసెస్ చేయవచ్చని స్పష్టం చేశారు, కానీ ఎఎఫ్ఎ-AFA తో.
2. “కార్డ్ లావాదేవీల భద్రతను మెరుగుపరచడం” పై జనవరి 15, 2020 నాటి ఆర్‌బిఐ సర్క్యులర్ DPSS.CO.PD No.1343/02.14.003/2019-20 ను కూడా పరిశీలించాలి, ఇందులో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలతో సహా వివిధ కార్డ్ ఫీచర్స్ కోసం వినియోగదారులకు స్విచ్ ఆన్ / ఆఫ్ లేదా పరిమితుల నిర్ణయింపు ఎంపికను కల్పించారు. అక్టోబర్ 1, 2020 నుండి అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు, వినియోగదారులకు వారి అవసరాలు మరియు సౌకర్యాలు కోసం కావలసినవి నిర్ణయించడంలోను మరియు తగు కార్డ్ ఫీచర్స్ ఏర్పాటుకు వారిని శక్తివంతం చేయడం ద్వారా, కార్డ్ లావాదేవీలను మరింత సురక్షితం చేశాయి.
3. ప్రస్తుత COVID-19 మహమ్మారి కాంటాక్ట్‌లెస్ లావాదేవీల ప్రయోజనాలను నొక్కి చెప్పింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇంకా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం ఆధారంగా, డిసెంబర్ 04, 2020 నాటి అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన లో కాంటాక్ట్‌లెస్ కార్డ్ ప్రతి లావాదేవికి ఎఎఫ్ఎ-AFA పరిమితి సడలింపు ప్రకటించబడింది. వినియోగదారుల భద్రత కు పెద్ద పీట వేయడంతో తదనుగుణంగా, ప్రతి లావాదేవీ పరిమితిని ₹ 5,000/- కు పెంచాలని నిర్ణయించారు. కార్డ్ హోల్డర్ లావాదేవీలకై ఉన్న కాంటాక్ట్ లేదా కాంటాక్ట్‌లెస్ మోడ్ విచక్షణ తో సహా ఇప్పటివరకు ఉన్న అన్ని ఇతర ఆవశ్యకాల వర్తింపు కొనసాగుతుంది.
4. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 లోని సెక్షన్ 18 (చట్టం 51 of 2007) తో కలిపి, సెక్షన్ 10 (2) క్రింద ఈ ఆదేశం జారీ చేయబడినది మరియు జనవరి 01, 2021 నుండి అమలులోకి వస్తుంది.
మీ విధేయులు,
(పి. వాసుదేవన్)
చీఫ్ జనరల్ మేనేజర్ |