ఆర్‌బిఐ/2021-22/29
DOR.AML.REC.13/14.01.001/2021-22
మే 5, 2021
అన్ని నియంత్రిత సంస్థల ఛైర్‌పర్సన్‌లు/సీఈఓలు
మేడమ్/సర్,
KYC యొక్క క్రమానుగత నవీకరణ – అనుపాలన పాటించని కారణంగా ఖాతా కార్యకలాపాలపై పరిమితులు
దయచేసి ఫిబ్రవరి 25, 2016 నాటి KYC మాస్టర్ డైరెక్షన్ యొక్క సెక్షన్ 38 ని చూడండి, వీటి ప్రకారం నియంత్రిత (రెగ్యులేటెడ్) ఎంటిటీలు (REలు) ప్రస్తుత ఖాతాదారుల యొక్క KYC నవీకరణను క్రమానుగతంగా నిర్వహించాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రస్తుత కోవిడ్-19 సంబంధిత పరిమితులను దృష్టిలో ఉంచుకుని, KYC యొక్క క్రమానుగత నవీకరణ జరగాల్సిన మరియు పెండింగ్‌లో ఉన్న ఖాతాదారుల ఖాతాలకు సంబంధించి, అటువంటి ఖాతాల యొక్క కార్యకలాపాలకు, ఈ కారణంగా మాత్రమే, ఏదైనా రెగ్యులేటర్/ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ/కోర్టు న్యాయస్థానం మొదలైన సూచనల మేరకు హామీ ఇవ్వకపోతే, ఎటువంటి పరిమితులు డిసెంబర్ 31, 2021 వరకు విధించరాదని నియంత్రిత (రెగ్యులేటెడ్) ఎంటిటీలకు సూచించడమైనది.
అటువంటి సందర్భాల్లో వినియోగదారుల KYC నవీకరించబడేందుకు వారితో నియంత్రిత ఎంటిటీలు నిరంతరంగా సంధానంగా వుండాలని కూడా సూచించడమైనది.
మీ విధేయులు
(ప్రకాష్ బలియార్ సింగ్)
చీఫ్ జనరల్ మేనేజర్ |