Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (520.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 05/05/2021
చలన ముందస్తు అంచనాల (ఫ్లోటింగ్ ప్రొవిజన్స్) వినియోగం/ ప్రతికూల చక్రీయ ముందస్తు అంచనాల (కౌంటర్ సైక్లికల్ ప్రొవిజనింగ్ బఫర్) కోసం బఫర్

ఆర్‌బిఐ/2021-22/28
DOR.STR.REC.10/21.04.048/2021-22

మే 5, 2021

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు చెల్లింపుల బ్యాంకులు మినహా)

మేడమ్/ప్రియమైన సర్,

చలన ముందస్తు అంచనాల (ఫ్లోటింగ్ ప్రొవిజన్స్) వినియోగం/
ప్రతికూల చక్రీయ ముందస్తు అంచనాల (కౌంటర్ సైక్లికల్ ప్రొవిజనింగ్ బఫర్) కోసం బఫర్

బ్యాంకుల అకౌంటింగ్, డిస్క్లోజర్స్, మరియు ముందస్తు అంచనాల (ఫ్లోటింగ్ ప్రొవిజన్స్) వినియోగంఫై దయచేసి జూన్ 22, 2006 నాటి మా సర్క్యులర్ DBOD.No.BP.BC.89/21.04.048/2005-06 మరియు మార్చి 13, 2007 నాటి DBOD.No.BP.BC.68/21.04.048/2006-07లను  చూడండి. ప్రతికూల చక్రీయ ముందస్తు అంచనాల బఫర్ (కౌంటర్ సైక్లికల్ ప్రొవిజనింగ్ బఫర్) యొక్క సృష్టి మరియు వినియోగం గురించి ఏప్రిల్ 21, 2011 నాటి మా సర్క్యులర్ DBOD.No.BP.BC.87 /21.04.048/2010-11 ను కూడా బ్యాంకులు చూడవచ్చు, ఇందులో బఫర్ అనుమతించబడుతుందని మేము సలహా ఇచ్చాము. ఆర్‌బిఐ యొక్క ముందస్తు అనుమతితో, వ్యవస్థ విస్తృత తిరోగమన కాలంలో, నిరుపయోగమైన ఆస్తుల కోసం నిర్దిష్ట ముందస్తు అంచనాలు చేయడానికి బ్యాంకులచే ఈ బఫర్ ఉపయోగించబడుతుంది.

2. మా సర్కులర్స్ ఫిబ్రవరి 7, 2014 నాటి DBOD.No.BP.95/21.04.048/2013-14 మరియు మార్చి 30, 2015 నాటి DBR.No.BP.BC.79/21.04.048/2014-15, ప్రకారం, బ్యాంకులు నిరుపయోగమైన ఆస్తుల కోసం నిర్దిష్ట నిబంధనలు చేయడానికి, మార్చి 31, 2013 మరియు డిసెంబర్ 31, 2014 నాటికి వరుసగా 33 శాతం మరియు 50 శాతం చలన ముందస్తు అంచనాల/ప్రతికూల చక్రీయ ముందస్తు అంచనాల బఫర్లను, వారి బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం ఉపయోగించుకోవడానికి అనుమతించబడ్డాయి.

3. బ్యాంకులపై కోవిడ్-19 సంబంధిత ఒత్తిడి యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, మూలధన పరిరక్షణను ప్రారంభించే చర్యగా, డిసెంబరు 31, 2020 నాటికి వున్న చలన ముందస్తు అంచనాల/ప్రతికూల చక్రీయ ముందస్తు అంచనాల బఫర్లను నిరర్ధక ఆస్తుల కోసం నిర్దిష్ట నిబంధనలు చేయడానికి వారి బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం 100% ఉపయోగించుకోవడానికి అనుమతించబడ్డాయి. ఇటువంటి వినియోగం తక్షణమే మరియు మార్చి 31, 2022 వరకు అనుమతించబడుతుంది.

మీ విధేయులు,

(మనోరంజన్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….