ఆర్‌బిఐ/2021-22/41
CO.DPSS.POLC.No.S-106/02-14-003/2021-2022
మే 21, 2021
అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు/
పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/చెల్లింపు బ్యాంకులు/చిన్న ఆర్థిక బ్యాంకులు/
లోకల్ ఏరియా బ్యాంకులు/నాన్-బ్యాంక్ పిపిఐ జారీచేసేవారు/
అధీకృత చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు/పాల్గొనేవారు
మేడం/డియర్ సర్
వివిధ చెల్లింపు అవసరాల కొరకు అనుపాలన కాలవ్యవధిలో సడలింపు
భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన క్రింది ఆదేశాలపై బ్యాంకుల దృష్టి కోరడమైనది – (ఎ) ముందు చెల్లింపు సాధనాల జారీ మరియు కార్యకలాపాలపై (పిపిఐ-ఎండి) అక్టోబర్ 11, 2017 నాటి DPSS.CO.PD.No.1164/02.14.006/2017-18 (ఎప్పటికప్పుడు నవీకరించబడినట్లు) మాస్టర్ డైరెక్షన్; (బి) అధీకృత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించి విఫలమైన లావాదేవీల కోసం హార్మోనైజేషన్ ఆన్ టర్న్ ఎరౌండ్ టైమ్ (టాట్) మరియు సేవాదారుని పరిహారంపై సెప్టెంబర్ 20, 2019 నాటి DPSS.CO.PD.No.629/ 02.01.014/2019-20; (సి) చెల్లింపు వ్యవస్థల యొక్క సిస్టమ్ ఆడిట్ యొక్క పరిధి మరియు కవరేజ్ పై జనవరి 10, 2020 నాటి DPSS.CO.OD.No.1325/ 06.11.001/2019-20; (డి) చెల్లింపు అగ్రిగేటర్స్ (పిఏ) మరియు చెల్లింపు గేట్‌వేల (పిజి) నియంత్రణ మార్గదర్శకాలపై మార్చి 17, 2020 నాటి DPSS.CO.PD.No.1810/02.14.008/2019-20 మరియు; (ఇ) వివిధ చెల్లింపు వ్యవస్థ అవసరాల కొరకు అనుపాలన కాలవ్యవధిలో పొడిగింపుపై జూన్ 4, 2020 నాటి DPSS.CO.PD.No.1897/02.14.003/2019-20.
2. COVID-19 మహమ్మారి యొక్క పునరుత్థానం మరియు వివిధ బ్యాంక్ మరియు నాన్-బ్యాంక్ సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, అనుబంధంలో వివరించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించి అనుపాలన కోసం సూచించిన కాలవ్యవధిని పొడిగించాలని నిర్ణయించడమైనది.
3. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 (చట్టం 51 ఆఫ్ 2007) లోని సెక్షన్ 18 తో సెక్షన్ 10 (2) క్రింద ఈ ఆదేశం జారీ చేయబడింది.
మీ విధేయులు
(పి. వాసుదేవన్)
చీఫ్ జనరల్ మేనేజర్
మే 21, 2021 నాటి ఆర్‌బిఐ సర్క్యులర్ CO.DPSS.POLC.No.S-106/02-14-003/2021-2022 కు అనుబంధం
క్రమ సంఖ్య |
కార్య సూచన/సర్కులర్ |
ప్రస్తుత కాలక్రమం |
సవరించిన కాలక్రమం |
1 |
ప్రస్తుతమున్న అన్ని నాన్-బ్యాంక్ పిపిఐ జారీచేసేవారు (పిపిఐ-ఎండి జారీ చేసే సమయంలో) మార్చి 31, 2020 నాటి (ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్) ఆర్థిక స్థితికి కనీస సానుకూల నికర-విలువ రూ.15 కోట్లు అవసరం. |
మార్చ్ 31, 2021 నాటి ఆర్ధిక స్థితి |
సెప్టెంబర్ 30, 2021 నాటి ఆర్ధిక స్థితి |
2 |
అధీకృత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించి విఫలమైన లావాదేవీలకు TAT మరియు కస్టమర్ పరిహారం యొక్క సమన్వయం - “క్యాలెండర్ రోజులు” “పని దినాలు” గా చదవబడుతుంది. |
డిసెంబర్ 31, 2020 వరకు పని రోజులు (జనవరి 1, 2021 నుండి క్యాలెండర్ రోజులు) |
పని రోజులు - భావి సూచకమైన- సెప్టెంబర్ 30, 2021 వరకు |
3 |
CERT-IN ఎంపానెల్డ్ ఆడిటర్లు లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయబడిన సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ డిప్లొమా అర్హత కలిగిన అధీకృత చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్స్ (పిఎస్ఓ), సిస్టమ్ ఆడిట్ నివేదికను ఆయా ఆర్థిక సంవత్సరం ముగిసిన రెండు నెలల్లో, వార్షిక ప్రాతిపదికన అందించడం అవసరం. |
మే 31, 2021 నాటికి |
సెప్టెంబర్ 30, 2021 నాటికి |
4 |
PA సేవలను అందించే ప్రస్తుత నాన్-బ్యాంక్ సంస్థలు జూన్ 30, 2021 న లేదా అంతకు ముందు అధీకృత కోసం దరఖాస్తు చేసుకోవాలి. |
జూన్ 30, 2021 నాటికి |
సెప్టెంబర్ 30, 2021 నాటికి * |
* మార్చి 31, 2021 నాటి సర్క్యులర్ CO.DPSS.POLC.No.S33/02-14-008/2020-2021 ద్వారా చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లు మరియు పాల్గొనేవారు మార్చి 17, 2020 నాటి సర్క్యులర్‌లోని పేరా 7.4 మరియు 10.4 యొక్క నిబంధనలకు అనుగుణంగా పని చేయగల పరిష్కారాలకు వీలు కల్పించడానికి కాలపరిమితి పొడిగింపబడింది. |
|