జులై 22, 2011
కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ క్రింద పేర్కొన్నటువంటి యాభై పైసలు, ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు మరియు పది రూపాయల నాణేలను త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది. వివిధ డినామినేషన్లలోని (విలువ) ఈ నాణేలు క్రింద ఇవ్వబడిన పరిమాణం, డిజైన్ మరియు మిశ్రమాల వివరాలకు అనుగుణంగా ఉంటాయి. అవేమిటంటే –
| నాణెంవిలువ (డినామినేషన్) |
ఆకృతి మరియు బాహ్యపు నడిమికొలత |
అంచుల (రంపపుపళ్ళలాంటి) సంఖ్య (సేర్రెషణ్ లు) |
లోహపు మిశ్రమం వివరాలు |
| యాభై పైసలు |
వర్తులాకారము
19 మిల్లీమీటర్లు |
అంచుమీద
100 సేర్రెషణ్ లు |
ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కలిగియున్న- ఇనుము – 83% క్రోమియం – 17% |
| ఒక రూపాయి నాణెం |
వర్తులాకారము
22 మిల్లీమీటర్లు |
మూలకుమూలగా వ్యతిరేకదిశలో
25 సేర్రెషణ్ లు |
ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కలిగియున్న- ఇనుము – 83% క్రోమియం – 17% |
| రెండు రూపాయల నాణెం |
వర్తులాకారము
25 మిల్లీమీటర్లు |
అంచుమీద
50 విశాలమైన సేర్రెషణ్ లు |
ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కలిగియున్న- ఇనుము – 83% క్రోమియం – 17% |
| ఐదు రూపాయల నాణెం |
వర్తులాకారము
23 మిల్లీమీటర్లు |
అంచుమీద
100 సేర్రెషణ్ లు |
నికెల్ ఇత్తడి
రాగి – 75% జింకు – 20% నికెల్ – 5% |
| పది రూపాయల నాణెం |
వర్తులాకారము
27 మిల్లీమీటర్లు |
అల్యూమినియం కంచు రాగి – 92% అల్యూమినియం – 6% నికెల్ – 2% |
కుప్రో-నికెల్ రాగి – 75% నికెల్ – 25% |
ఈ నాణేలు క్రింద ఇవ్వబడిన నమూనాల(డిజైన్లు)కు అనుగుణంగా ఉంటాయి. అవేమిటంటే –
| నాణెం విలువ (డినామినేషన్) |
ముందువైపు |
వెనుకవైపు |
| యాభై పైసల నాణెం |
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య అంతర్లిఖితమై ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం హిందీలో, మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, అంతర్లిఖితమై ఉంటాయి. |
నాణెం ఈ వైపున డినామినేషన్ విలువ “50” అని అంతర్జాతీయ సంఖ్యలలో, ఎడమ మరియు కుడి పరిధులలో ఫ్లోరల్ డిజైన్ తో ఉంటుంది. పై పరిధిలో “पैसे” (పైసే)అనే పదం హిందీలో మరియు “PAISE” (పైసే) అనే పదం ఇంగ్లీషులో డినామినేషన్ విలువ అడుగున ఉంటాయి. నాణెం క్రింది పరిధిలో నాణెం ముద్రించిన సంవత్సరం అంతర్జాతీయ సంఖ్యలలో చూపబడింది. |
| ఒక రూపాయి నాణెం |
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య అంతర్లిఖితమై ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం హిందీలో మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, అంతర్లిఖితమై ఉంటాయి. |
నాణెం ఈ వైపున డినామినేషన్ విలువ “1” అని అంతర్జాతీయ సంఖ్యలో, ఎడమ మరియు కుడి పరిధులలో పుష్పసంబంధమైన(ఫ్లోరల్) డిజైన్ తో ఉంటుంది. పై పరిధిలో రూపాయి (రుపీ) చిహ్నం “₹” మరియు క్రింది పరిధిలో నాణెం ముద్రించిన సంవత్సరం అంతర్జాతీయ సంఖ్యలలో చూపబడ్డాయి. |
| రెండు రూపాయల నాణెం |
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య అంతర్లిఖితమై ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం హిందీలో, మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, అంతర్లిఖితమై ఉంటాయి. |
నాణెం ఈ వైపున డినామినేషన్ విలువ “2” అని అంతర్జాతీయ సంఖ్యలో ఎడమ మరియు కుడి పరిధులలో పుష్పసంబంధమైన (ఫ్లోరల్) డిజైన్ తో ఉంటుంది. పై పరిధిలో రూపాయి (రుపీ) గుర్తు “₹” మరియు క్రింది పరిధిలో నాణెం ముద్రించిన సంవత్సరం అంతర్జాతీయ సంఖ్యలలో చూపబడ్డాయి. |
| ఐదు రూపాయల నాణెం |
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య అంతర్లిఖితమై ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం హిందీలో, మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, అంతర్లిఖితమై ఉంటాయి. |
నాణెం ఈ వైపున డినామినేషన్ విలువ “5” అని అంతర్జాతీయ సంఖ్యలో ఎడమ మరియు కుడి పరిధులలో పుష్పసంబంధమైన(ఫ్లోరల్) డిజైన్ తో ఉంటుంది. పై పరిధిలో రూపాయి (రుపీ) చిహ్నం “₹” మరియు క్రింది పరిధిలో నాణెం ముద్రించిన సంవత్సరం అంతర్జాతీయ సంఖ్యలలో చూపబడ్డాయి. |
| పది రూపాయల నాణెం |
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య అంతర్లిఖితమై ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం హిందీలో, మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, అంతర్లిఖితమై ఉంటాయి. దిగువ భాగం అంతర్జాతీయ సంఖ్యలలో సంవత్సరాన్ని కలిగి ఉంది. |
పై పరిధి వైపున 10 సంఖ్యలు బయటికి వ్యాపిస్తున్నమాదిరి వృద్ధి మరియు సంధాయకత ను వర్ణిస్తున్నాయ. మధ్యభాగం లో రూపాయి (రుపీ) చిహ్నం “₹” కలిగి ఉంటుంది మరియు క్రింది పరిధిలో డినామినేషన్ విలువ “10” అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. |
ఈ నాణెలు ‘భారతీయ కాయినేజ్ చట్టం, 1906’ (Indian Coinage Act, 1906) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఇదే విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
జె. డి. దేశాయ్
అసిస్టెంట్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2011-2012/120 |