సెప్టెంబర్ 3, 2015
'ఇండో-పాక్ యుద్ధం 1965 స్వర్ణ జయంతి' స్మారకార్థం రిజర్వ్ బ్యాంక్ చే ₹ 5 నాణేల విడుదల
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో 'ఇండో-పాక్ యుద్ధం 1965 స్వర్ణ జయంతి' స్మారకార్థం, భారత ప్రభుత్వంచే ముద్రించబడిన ₹ 5 నాణేలను చలామణిలో పెట్టనుంది.
నాణేల నమూనా:
ముందువైపు: అశోక స్తంభ శీర్షంపైగల సింహం బొమ్మ మధ్యలో ఉండి, దానిక్రింద 'సత్యమేవ జయతే' అన్న వాక్యం దేవనాగరి లిపిలో వ్రాయబడి ఉంటుంది. నాణెం ఎడమ అంచున, 'భారత్' అనే పదం దేవానాగరి లిపిలో, కుడి అంచున 'INDIA' అనే పదం ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంటాయి. సింహ శీర్షం క్రింద '₹' చిహ్నం, '5' అని అంకె అంతర్జాతీయ సంఖ్యలలో వ్రాయబడి ఉంటాయి.
వెనుకవైపు: అమర్ జవాన్ స్మారక స్తంభం బొమ్మ మధ్యలో ఉండి, దానికి ఇరువైపులా ఆలివ్ ఆకుల కొమ్మలు ఉంటాయి. ఎడమ అంచు పై భాగం లో 'వీరతా ఏవం బలిదాన్' అని దేవనాగరి లిపిలో, కుడి అంచు పై భాగంలో, 'VALOUR AND SACRIFICE' అని ఇంగ్లీష్ లో చెక్కబడి ఉంటాయి. సంవత్సరం '2015' అని స్మారకస్తంభం క్రింద వ్రాయబడి ఉంటుంది. పై అంచున '1965 సామరిక్ అభియాన్ స్వర్ణ జయంతి వర్ష్' అని దేవనాగరి లిపిలో, క్రింది అంచున 'GOLDEN JUBILEE 1965 OPERATIONS' అని ఇంగ్లీష్ లో లిఖించబడి ఉంటుంది.
ఈ నాణేలు, ది కాయినేజ్ ఏక్ట్ 2011, ప్రకారం చట్టబద్ధంగా చలామణి అవుతాయి. ఈ విలువతో, ఇప్పుడు ఉన్న నాణేలు కూడా చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయి. అల్పనా కిల్లావాలా
ప్రిన్‌సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/577 |