ఆగస్ట్ 28, 2015
ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఖామ్‌గాఁవ్, బుల్ధాన, మహారాష్ట్ర కు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల ఉపసంహరణ
భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెప్టెంబర్ 12, 2012 న, ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ఖామ్‌గాఁవ్, బుల్ధాన, మహారాష్ట్ర కు జారీ చేసిన సమగ్ర నిర్దేశాలను, ఆగస్ట్ 26, 2015, పనిముగింపు వేళ నుండి ఉపసంహరించింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, సబ్ సెక్షన్ (2) ద్వారా రిజర్వ్ బ్యాంక్ కు సంక్రమించిన అధికారాలతో, ఈ నిర్దేశాలు ఉపసంహరించబడ్డాయి.
ఈ ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడింది. బ్యాంక్, యథావిధిగా బ్యాంకింగ్ కార్య కలాపాలు కొనసాగిస్తుంది.
సంగీతా దాస్
డైరెక్టర్
పత్రికా ప్రకటన: 2015-2016/534 |