సెప్టెంబర్ 10, 2015
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డ్ లో Ms. అంజులీ చిబ్ దుగ్గల్ నియామకం
కేంద్ర ప్రభుత్వం, Ms. అంజులీ చిబ్ దుగ్గల్, కార్యదర్శి, ఆర్ధిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, న్యూ దిల్లీ, గారిని భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్ర డైరెక్టర్ల బోర్డ్ (Central Board of Directors) లో, డా. హస్ముఖ్ ఆధియా స్థానంలో, డైరెక్టర్‌గా నియుక్తుల్ని చేసింది. ఈ నియామకం, సెప్టెంబర్ 3, 2015 నుంచి, తిరిగి ఉత్తరువులు జారీచేసేదాకా అమలులో ఉంటుంది.
అల్పన కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/635 |