సెప్టెంబర్ 10, 2015
శ్రీ ఛత్రపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పింప్లే నిలాఖ్, పుణె జిల్లా, మహారాష్ట్ర, కు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల కాల వ్యవధి మరి కొంతకాలం పొడిగింపు
సెప్టెంబర్ 10, 2014 తేదీన జారీ చేసిన ఉత్తరువులు UBD.CO.BSD–I No./D-09/12.22.460/2014-15 ద్వారా శ్రీ ఛత్రపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పింప్లే నిలాఖ్, పుణె జిల్లా, మహారాష్ట్ర, సెప్టెంబర్ 12, 2014 పని ముగింపు వేళ నుంచి, ఆరు నెలలపాటు, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాల పరిధిలోకి తేబడింది. ఈ నిర్దేశాల కాల అవధి, మార్చ్ 04, 2015 న జారీ చేసిన ఉత్తరువుల ద్వారా, మార్చ్ 11, 2015 పనివేళల ముగింపు సమయం నుంచి, మరొక ఆరు నెలలు పెంచబడింది. ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమేమనగా, సెప్టెంబర్ 10, 2014 మరియు మార్చ్ 04, 2015 న జారీ చేయబడ్డ ఉత్తరువులు అమలులో ఉండే కాలవ్యవధి, సెప్టెంబర్ 01, 2015 న మార్పు చేయబడ్డ ఆదేశాల ద్వారా, సెప్టెంబర్ 10, 2015 పని ముగింపు వేళ నుంచి, ఇంకొక మూడు నెలల పొడిగించబడినది. అయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించవచ్చు. ఇతర షరతులు, నిబంధనల్లో ఏ మార్పూ లేదు. పై మార్పుల్ని సూచిస్తూ సెప్టెంబర్ 01, 2015 న జారీ చేసిన ఉత్తరువుల ప్రతి, ప్రజల సమాచారం కొసం శ్రీ ఛత్రపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., వారి ఆవరణలో ప్రదర్శించబడింది.
బ్యాంక్‌యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడింది అని రిజర్వ్ బ్యాంక్ భావించడం వల్లనే, పైన తెలిపిన మార్పులు చేయడం జరిగింది అని ఎంతమాత్రము అనుకోరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/641 |