Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (96.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 10/09/2015
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, ఇండియన్‌ మర్కన్‌టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్, కు జారీ చేసిన నిర్దేశాల కాల వ్యవధి డిసెంబర్ 11, 2015 వరకు పొడిగింపు

సెప్టెంబర్ 10, 2015

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, ఇండియన్‌ మర్కన్‌టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్, కు జారీ చేసిన నిర్దేశాల కాల వ్యవధి డిసెంబర్ 11, 2015 వరకు పొడిగింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇండియన్‌ మెర్కన్‌టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, కు జారీ చేసిన నిర్దేశాల కాల అవధి మరొక మూడు నెలలు, అనగా, సెప్టెంబర్ 12, 2015 నుండి డిసెంబర్ 11, 2015 వరకు, పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం పై పునరాలోచనకు అవకాశం ఉంది. ఈ బ్యాంక్, జూన్‌ 12, 2014 నుండి నిర్దేశాల పరిధిలో ఉంది.

ఈ ఆదేశాల ప్రకారం, ఇండియన్‌ మర్కన్‌టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, నిర్దేశాలు అమలులో ఉన్న కాలంలో, అనగా, జూన్‌ 12, 2014 నుండి డిసెంబర్ 11, 2015 వరకు, ఈ నిర్దేశాల మేరకు తప్ప, ముందుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి పొందనిదే- అప్పులు, రుణాలు జారీ చేయరాదు మరియు నవీకరించరాదు: క్రొత్త పెట్టుబడులు పెట్టరాదు: అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపాజిట్లు అంగీకరించుటతో సహా, ఎటువంటి రుణభారము స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నెరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి, రాజీ, సర్దుబాటు ఒప్పందములు చేసుకొనరాదు. వారి ఆస్తులను, సంపత్తులను, అమ్మరాదు, బదిలీ చేయరాదు లేక ఇంకేవిధంగానూ వేరొకరి హస్తగతము చేయరాదు. ఇంతేగాక, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ , కరెంట్ అకౌంట్, మరేదేని డిపోజిట్ ఖాతా లోని మొత్తం నగదు నిల్వనుండి, ఒకసారికి 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయిలు) వరకు మాత్రమే తీసుకోవడానికి బ్యాంక్ సమ్మతించవచ్చు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సబ్ సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A క్రింద సంక్రమించిన అధికారాలతో మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 56 కు అనుసారంగా, ఈ నిర్దేశాలు జారీచేయబడ్డాయి. ఈ ఆదేశాల ప్రతి, ఆసక్తిగల ప్రజల సమాచారంకోసం, ఇండియన్‌ మర్కన్‌టైల్ కో-ఆపెరేటివ్ బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శింపబడింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు జారీ చేసినంతమాత్రాన, బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. పరిస్థితుల్ని బట్టి, ఈ నిర్దేశాల్లో సవరణలు చేయవచ్చా అని రిజర్వ్ బ్యాంక్, పరిశీలిస్తుంది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన; 2015-2016/642

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….