Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (123.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 15/09/2015
జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్ష (National Financial Literacy Assessment Test) 2015-2016, నవంబర్ 28-29, 2015

సెప్టెంబర్ 15, 2015

జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్ష (National Financial Literacy Assessment Test) 2015-2016, నవంబర్ 28-29, 2015

జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం {National Centre for Financial Education (NCFE)} నవంబర్ 28 మరియు 29, 2015, తారీకుల్లో జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్షను (NCFE-NFLAT 2015-2016) నిర్వహించబోతోంది . ఈ పరీక్షలో, VIII నుంచి X వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చు.

NCFE, భారత దేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, చే {National Institute of Securities Markets (NISM)}, సహకార ప్రాతిపదికన, నెలకొల్పబడింది. దీని స్థాపనకు, అన్ని భారతీయ ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఇన్ష్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), పెన్షన్‌ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) మరియు ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్‌ (FMC), మద్దతునిచ్చాయి. జాతీయ ఆర్థిక శిక్షణా ప్రణాళిక అమలుకు {National Strategy for Financial Education (NSFE)} ఇది కేంద్రీయ వ్యవస్థ.

ఈ పరీక్ష (NCFE-NFLAT), ఆర్థిక అక్షరాస్యతను, ఆర్థిక సమీకరణాన్ని మెరుగు పరిచే దిశలో, ఒక మెట్టు. VIII నుంచి X వ తరగతి విద్యార్థులు ఆర్థిక సిద్ధాంతాలని అవగాహన చేసుకొనేలా ప్రోత్సహించి, వారి ఆర్థిక పరిజ్ఞానాన్ని పరీక్షించి, భావి జీవితంలో తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి పనికివచ్చే నైపుణ్యాలని వారిలో పెంపొందించడమే, ఇందులో NCFE ఉద్దేశం.

కార్యక్రమము

NCFE-NFLAT కొరకు నమోదు చేసుకోవడము సెప్టెంబర్ 1, 2015 నుండి మొదలయ్యింది మరియు అభ్యర్థనలు పాఠశాలల ద్వారా మాత్రమే అంగీకరించబడతాయి. పాఠశాలలు, http://www.ncfeindia.org/nflat లో సూచనలను అనుసరించి నమోదు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

వివరాలు తేదీలు
నమోదుల ప్రారంభం సెప్టెంబర్ 1, 2015
నమోదుల ముగింపు అక్టోబర్ 17, 2015
పరీక్ష నవంబర్ 28 & 29, 2015
ఫలితాలు డిసెంబర్ 16, 2015

పరీక్షా సమయము - 60 నిమిషాల్లో, విద్యార్థులు 75 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహించే ఈ పరీక్షలో, ప్రాథమిక ఆర్థిక సిద్ధాంతాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పాఠ్యాంశాల వివరణ కోసం, http://www.ncfeindia.org/nflat చూడండి.

ఈ పరీక్షకు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే ముందు చేరిన అభ్యర్థనలు ముందుగా నమోదు చేసుకోవడం జరుగుతుంది.

బహుమతులు:

పాఠశాలలకు: మొదట నిలిచిన 30 పాఠశాలలకు, ట్రోఫీ/షీల్డ్‌తో బాటు, 25, 000/- నగదు బహుమతి.

విద్యార్థులకు: NCFE-NFLAT పరీక్షలో విజేతలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్లు, పతకాలు, నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలతో అభినందించబడతారు.

మరిన్ని వివరాలకు, వెబ్‌సైట్ http://www.ncfeindia.org/nflt చూడండి.

మరింత సమాచారంకోసం, సందేహాలకోసం ఈ క్రిందివారిని సంప్రదించండి:-

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటిస్ మార్కెట్స్, ఎన్‌ ఐ ఎస్ ఎమ్‌ భవన్‌, ప్లాట్ నం. 82, సెక్టర్-17, వాశి, నవి ముంబయి – 4000703, ఫోన్‌: 022 - 66735100-05; ఫ్యాక్స్: 022 – 66735100-05; ఇ-మైల్: వెబ్‌సైట్: www.ncfeindia.org / www.nism.ac.in

అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2015-2016/677

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….