నవంబర్ 03, 2015
పసిడి నగదీకరణ పథకం క్రింద డిపాజిట్ చేయవలసిన ముడి బంగారం కనీస పరిమాణం 30 గ్రా అయి ఉండాలి
భారతీయ రిజర్వ్ బ్యాంక్, పసిడి నగదీకరణ పథకం, ఆదేశం 2015 లో తాము సూచించిన, కనీస డిపాజిట్ పరిమాణం మార్పు చేసింది. ఈ మార్పురీత్యా, ఒక పర్యాయం డిపాజిట్ చేయవలసిన ముడి బంగారం పరిమాణం, కనీసం 30 గ్రా. అయి ఉండాలి [కడ్డీలు; నాణేలు; ఆభరణాలు (పొదిగిన రాళ్ళు/ ఇతర లోహాలు కాకుండా)]
ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులు స్వఛ్ఛతలో వ్యత్యాసాలు కలిగి ఉంటాయి గనుక, అవి ఎంత పరిమాణమైతే, 30 గ్రా. 995 స్వఛ్ఛత గల ముడి బంగారానికి సమానమౌతుందో, ముందుగా అంచనా వేయడం సాధ్యంకాదని, నివేదనలు అందాయి. ఆకారణంగా, పసిడి నగదీకరణ పథకం, 2015, పై మాస్టర్ డైరెక్షన్ లోని సెక్షన్ 2. 1. 2 (i) ని రిజర్వ్ బ్యాంక్ మార్పు చేసింది. మార్పుచేసిన, అక్టోబర్ 22, 2015 తేదీ మాస్టర్ డైరెక్షన్, పూర్తి పాఠాంతరం, రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
ఈ ఆదేశాలు నవంబర్ 5, 2015 నుండి అమలులోకి వస్తాయి.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/1071 |