నవంబర్ 13, 2015
ఆదాయ పన్ను బకాయిలు రిజర్వ్ బ్యాంక్ లో గాని, అధికృత బ్యాంక్ శాఖల్లో గానీ ముందుగానే గాని చెల్లించండి
భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆదాయ పన్ను చెల్లింపుదారులను, వారి ఆదాయపు పన్ను బకాయిలను, గడువు తేదీకి మరింత ముందుగానే చెల్లించవలెనని విజ్ఞప్తి చేసింది. ఇంకా, పన్ను చెల్లింపుదారులు, ఎంపిక చేసిన ప్రాతినిధ్య బ్యాంకులు, లేదా వారు అందించే ఆన్‌లైన్ సదుపాయంవంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఉపయోగిం చుకోవాలని సూచించింది. దీని వల్ల, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద బారులు తీరే అవసరం ఉండదు.
ప్రత్యేకించి, డిసెంబర్ చివరలో, పన్ను చెల్లించడానికి విపరీతమైన రద్దీ దృష్ట్యా, వీలయినంతమేరకు అదనపు కౌంటర్లు తెరిచినా, రశీదులు జారీ చేయడానికి, ఒత్తిడి ఎదురుకోవడం కష్టతరమౌతోంది. అదాయపు పన్ను బకాయిలు స్వీకరించడానికి, ఈ క్రింది ఇరవైతొమ్మిది ప్రాతినిధ్య బ్యాంకులకు అధికారం ఇవ్వబడింది:
1. |
అలహాబాద్ బ్యాంక్ |
2. |
ఆంధ్రా బ్యాంక్ |
3. |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
4. |
బ్యాంక్ ఆఫ్ ఇండియా |
5. |
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర |
6. |
కెనరా బ్యాంక్ |
7. |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
8. |
కార్పొరేషన్ బ్యాంక్ |
9. |
దేనా బ్యాంక్ |
10. |
IDBI బ్యాంక్ |
11. |
ఇండియన్ బ్యాంక్ |
12 |
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ |
13. |
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ |
14. |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ |
15. |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ |
16. |
సిండికేట్ బ్యాంక్ |
17. |
UCO బ్యాంక్ |
18. |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
19. |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
20. |
విజయా బ్యాంక్ |
21. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
22. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్ |
23. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ |
24. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ |
25. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసోర్ |
26. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా |
27. |
HDFC బ్యాంక్ లిమిటెడ్ |
28. |
ఏక్సిస్ బ్యాంక్ |
29. |
ICICI బ్యాంక్ లిమిటెడ్ |
|
|
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/1142 |