నవంబర్ 16, 2015
రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 500 బ్యాంక్ నోట్ల జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'L’ అక్షరం పొందుపరచిన ₹ 500 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్ జి రాజన్ సంతకం కలిగి ఉంటాయి. బ్యాంక్ నోట్ వెనుక ముద్రించిన సంవత్సరం, '2015' అని ముద్రించి ఉంటుంది. ఇపుడు జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, అనగా, నంబర్ ప్యానెళ్ళలో ఎడమనుండి, కుడికి పెరుగుతున్న అంకెల పరిమాణం, అంచుల చివర ఏటవాలు గీతలు (bleed lines), పెద్దవిగా చేసిన గుర్తింపు చిహ్నాలతో సహా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన ₹ 500 బ్యాంక్ నోట్లను పోలి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన నోట్లు మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2015 లో జారీ చేయబడ్డాయి.
రిజర్వ్ బ్యాంక్, గతంలో జారీ చేసిన ₹ 500 విలువ గల అన్ని బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణి లో కొనసాగుతాయి.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్చీఫ్ జనరల్మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/1157 |