జనవరి 28, 2016
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా
₹ 10 నాణేలు జారీ భారత ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా ముద్రించిన ₹ 10 నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది.
ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, న్యూడిల్లీ, అక్టోబర్ 26, 2015 వ తారీఖున జారీ చేసిన భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i), నం. 665 {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) – No.665} లో ప్రకటించిన (నోటిఫై) ఈ నాణేల నమూనా (డిజైన్) వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ముందువైపు:
నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) మధ్యలో ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య లిఖించబడి ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం దేవనాగరి లిపిలో మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, ముద్రించబడి ఉంటాయి. సింహ బురుజు (capitol) క్రింద రూపాయి చిహ్నం “₹” మరియు నాణెం విలువ (డినామినేషన్) “10” అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది.
వెనుకవైపు
నాణెం ఈ వైపున మధ్యలో “డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్” యొక్క చిత్తరువు ఉంటుంది. నాణెం పై పరిధి వైపున “डॉ. बी. आर. अम्बेडकर की 125 वी जयंती” అని దేవనాగరి లిపిలో మరియు క్రింది పరిధి వైపున “125th BIRTH ANNIVERSARY OF Dr. B.R. AMBEDKAR” అని ఇంగ్లీషులో చెక్కబడి ఉంటుంది. సంవత్సరం “2015” అని అంతర్జాతీయ సంఖ్యలలో, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యొక్క చిత్తరువు క్రింది వైపున లిఖించబడి ఉంటుంది.
ఈ నాణెలు ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The Coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
ప్రెస్ రిలీజ్: 2015-2016/1771 |