మార్చ్ 01, 2016
శ్రీ బి పి కనుంగో: RBI క్రొత్త కార్యపాలక నిర్దేశకులు (ED)
శ్రీ బి పి కనుంగో, రిజర్వ్ బ్యాంక్ క్రొత్త కార్య పాలక నిర్దేశకులుగా, ఈ రోజు పదవి చేపట్టారు. ఈయన, విదేశీ ముద్రా విభాగం (Foreign Exchange Department), ప్రభుత్వ మరియు బ్యాంక్ ఖాతాల విభాగం (Department of Government and Bank Accounts) అంతర్గత రుణ నిర్వహణ విభాగం (Internal Debt Management Department) పర్యవేక్షిస్తారు.
కేంద్రీయ బ్యాంక్ లోనే పదవి కొనసాగించిన ఈయన, కార్యపాలక నిర్దేశకులుగా పదవి చేపట్టే ముందు, విదేశీ ముద్రా విభాగం అధిపతిగా ఉన్నారు. అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ జైపూర్, కోల్కటా కార్యాలయాల ప్రాంతీయ నిర్దేశకులుగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల బ్యాంకింగ్ లోకపాల్గా (Banking Ombudsman) అధికారంలో ఉన్నారు.
ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుఏట్ డిగ్రీ కలిగిన శ్రీ బి పి కనుంగో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్ల, సర్టిఫైడ్ అసోసియేట్. ఈయనకు న్యాయ శాస్త్రంలో కూడా పట్టా ఉంది (LLB).
అల్పనా కిల్లావాల
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన : 2015-2016/2053 |