జూన్ 15, 2016
రిజర్వ్ బ్యాంక్‌చే "S" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 20 బ్యాంక్ నోట్ల జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్-2005 క్రింద, రెండు నంబర్ ప్యానెళ్ళలో "S” అక్షరం నిగూఢంగా ఉండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్, గవర్నర్, డా. రఘురామ్ రాజన్‌చే సంతకం చేయబడ్డ ₹ 20 బ్యాంక్ నోట్లు జారీ చేయనుంది. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది.
ప్రస్తుతం జారీ చేయనున్న బ్యాంక్ నోట్ల నమూనా, అన్ని విధాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన ₹ 20 నోట్ల వలెనే ఉంటుంది.
ఇంతకు ముందు జారీ చేసిన అన్ని ₹ 20 విలువగల నోట్లూ, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2015-2016/2914 |