జూన్ 28, 2016
4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచే (NBFCs) నమోదు పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్
రిజిస్ట్రేషన్ (Certificate of Registration)) రిజర్వ్ బ్యాంక్‌కు అప్పగింత
ఈ క్రింద తెలిపిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వారికి రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నమోదు పత్రాలు తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (Reserve Bank of India Act, 1934) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, వారి నమోదు పత్రాలను (Certificate of Registration) రద్దు చేసినది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
CoR No. |
జారీ చేసిన తేదీ |
రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ |
1 |
M/S శ్రీగోపాల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పి. లి. |
82-A, ఫ్లాట్ నం. 33, బృందావన్ సొసైటీ, థానే-400601 |
B.13.01360 |
ఆగస్ట్ 23, 2000 |
ఏప్రిల్ 11, 2016 |
2 |
M/S వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ లిమిటెడ్ |
స్పైస్ టవర్, CTS-R 10, ఫేజ్ II, ఆనంద్ నగర్, న్యూ లింక్ రోడ్, జోగేశ్వరి వెస్ట్, ముంబై-400102 |
B.13.01358 |
ఆగస్ట్ 09, 2000 |
మే 30, 2016 |
3 |
M/S JEL ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ |
ప్లాట్ నం. 29, నాగార్జున హిల్స్, పంజాగుట్ట, తెలంగాణా, హైదరాబాద్ - 500082 |
N-09. 00434 |
ఏప్రిల్ 30, 2010 |
జూన్ 03, 2016 |
4 |
M/S మారుతి ఫైనాన్స్ పి. లి. |
షాప్ నం. 6-3-1109/1, 3 ఫ్లోర్, రాజ్‌భవన్ రోడ్, సొమాజిగుడా, హైదరాబాద్ - 500082 |
B-09.00166 |
జులై 29, 2005 |
జూన్ 09, 2016 |
ఆ కారణంగా, ఈ కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45 – I , భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు కొనసాగించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2015-2016/3020 |