జూన్ 28, 2016
ప్రజల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాంక్, జులై 1, 2016 న తెరిచి ఉంటుంది
విషయం సమీక్షించిన అనంతరం, మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్‌కి, ప్రజా సౌకర్యానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ , జులై 1, 2016 తేదీన తెరిచి ఉంచాలని నిశ్చయించింది. సాధారణంగా, ప్రతీ జులై 1 న రిజర్వ్ బ్యాంక్, వారి ఖాతాల వార్షిక ముగింపు కారణంగా, ప్రజల కోసం తెరిచి ఉండదు. రిజర్వ్ బ్యాంక్ అకౌంటింగ్ సంవత్సరం జులై నుండి జూన్ వరకు.
వారి ఖాతాల వార్షిక ముగింపు సందర్భంగా జులై 1, 2016 న:
-
RTGS/NEFT, నగదు బదిలీ, సెక్యూరిటీల సెటిల్‌మెంట్ మొదలైన సేవలు ఉదయం 11.00 గం. నుండి అందుబాటులో ఉంటాయి;
-
T+0 ఆధారంగా జరిపిన అన్ని లావాదేవీల, నగదు / సెక్యూరిటీ సెటిల్‌మెంట్లు, ఉదయం 11.00 గం. నుండి చెయ్యబడతాయి;
-
తిరగరాయడం బకాయిలో ఉన్న అన్ని లిక్విడీటీ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం (LAF) మార్జినల్ స్టాండింగ్ సదుపాయం (MSF) లావాదేవీలు ఉదయం 11.00 గం. కు జరపబడతాయి;
-
LAF రిపో, ఉదయం 11.30 గం. నుండి మధ్యాహ్నం 3 గం. వరకు పనిచేస్తుంది;
-
14 రోజుల నిర్ణీతకాల రిపో వేలం, ఉదయం 12.30 గం. నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు జరుగుతుంది.
అల్పనా కిల్లవాలా ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన : 2015-2016/3028 |