జూన్ 30, 2016
జులై 1 నుండి, ఎంపిక చేసిన రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద, 2005 ముందటి బ్యాంక్ నోట్ల మార్పిడి
2005 సంవత్సరం మునుపటి బ్యాంక్ నోట్లు చాలామటుకు చెలామణినుండి ఉపసంహరించబడ్డాయనీ, తక్కువ శాతం మాత్రమే చెలామణిలో ఉన్నాయన్న విషయం రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. సమీక్షానంతరం, జులై 01, 2016 నుంచి కేవలం ఈ క్రింద సూచించిన రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద మాత్రమే, 2005 పూర్వపు బ్యాంక్ నోట్లు మార్చుకొనే సదుపాయం కల్పించాలని నిశ్చయించింది.
అహమదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భుబనేశ్వర్, చండిగఢ్, చెన్నై, గువహాతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్‌పూర్, కోల్కటా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ దిల్లీ, పట్నా, తిరువనంతపురం మరియు కోచి.
డిసెంబర్ 2015 లో, రిజర్వ్ బ్యాంక్, ఎంపిక చేసిన, వారి శాఖల్లో / జారీ విభాగాల్లో, 2005 ముందటి బ్యాంక్ నోట్లు మార్చుకోవడానికి, జూన్ 30, 2016 ఆఖరి తేదీగా నిర్ణయించింది.
రిజర్వ్ బ్యాంక్ 2005 పూర్వపు బ్యాంక్ నోట్లు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని స్పష్టం చేసింది.
వివిధ సిరీస్ కరెన్సీ నోట్లు, ఒకే సమయంలో చెలామణిలో ఉండడం, అంతర్జాతీయంగా, సాధారణ ఆనవాయితీ కాదని, రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ఈ బ్యాంక్ నోట్లు, చెలామణినుండి ఉపసంహరించడంలో ప్రజల సహకారం కోరుతూ, 2005 సం. మునుపటి బ్యాంక్ నోట్లను, వారి వీలునిబట్టి, పై కార్యాలయాల్లో మార్చుకోమని విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా ఈ ప్రక్రియ కొనసాగేలా, రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షిస్తూ/ సమీక్షిస్తూ ఉంటుంది.
అల్పనా కిల్లవాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన : 2015-2016/3051
| దీనికి సంబంధించి ఇతర పత్రికా ప్రకటనలు/ నోటిఫికేషన్‌లు |
| ఫిబ్రవరి 11, 2016 |
2005 సం. ముందు జారీ చేసిన బ్యాంక్ నోట్ల ఉపసంహరణa |
| డిసెంబర్ 23, 2015 |
2005 పూర్వపు బ్యాంక్ నోట్లు జూన్ 30, 2016 వరకు మార్చుకోవచ్చు |
| జూన్ 25, 2015 |
2005 పూర్వపు బ్యాంక్ నోట్ల ఉపసంహరణ తేదీ రిజర్వ్ బ్యాంక్ పొడిగించింది |
| డిసెంబర్ 23, 2014 |
2005 మునుపటి బ్యాంక్ నోట్లు వారి ఖాతాల్లో జమ చేయమని రిజర్వ్ బ్యాంక్ ప్క్జలకు విజ్ఞప్తి చేసింది |
| మార్చ్ 03, 2014 |
2005 ముందు బ్యాంక్ నోట్లు మార్చుకోవడానికి గడువు RBI జనవరి 01, 2015 వరకు పొడిగించింది. |
| జనవరి 24, 2014 |
2005 కు ముందు జారీ చేసిన బ్యాంక్ నోట్లు ఉపసంహరింపబడతాయని RBI స్పష్టంచేసింది. |
| జనవరి 22, 2014 |
2005 ముందు జారీ చేసిన బ్యాంక్ నోట్లు ఉపసంహరింప బడతాయి – RBI సూచన |
|