ఆగస్ట్ 26, 2016
'కేస్ రైటింగ్' పోటీ, 2016 ఫలితాలు ప్రకటించిన
ఆర్ బి ఐ, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్
భారతీయ రిజర్వ్ బ్యాంక్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్, పుణే 'కేస్ రైటింగ్' పోటీ, 2016 యొక్క ఫలితాలు ప్రకటించింది.
స్థానం |
పాల్గొన్నవారి పేరు |
హోదా |
బ్యాంక్ |
ప్రథమ |
Ms. మౌలి సంజీవ్ బోడివాలా |
మ్యానేజర్ |
ది కాలుపూర్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. |
ద్వితీయ |
Mr. వినీత్ కుమార్ జైన్ |
సీనియర్ మ్యానేజర్ |
బ్యాంక్ ఆఫ్ బరోడా |
తృతీయ |
Mr. సుప్రియ సాహా |
అసిస్టెంట్ మ్యానేజర్ |
బంగీయ గ్రామీణ్ వికాష్ బ్యాంక్ |
ఫిబ్రవరి 2016 లో కాలేజ్, 'వినూత్న పద్ధతి లో MSMEలకు రుణాలు జారీ చెయ్యడం' (Lending to an MSME borrower in an Innovative Way) అనే అంశంపై పోటీ నిర్వహించింది. ఈ పోటీ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, నగర సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఉద్యోగులకై ఉద్దేశించబడింది. ఎంట్రీలు, బ్యాంకింగ్, విద్యారంగం లో పేరుపొందిన సభ్యులు కలిగిన సభ్య మండలిచే, మూడు ప్రమాణాల ఆధారంగా పరిశీలించబడ్డాయి: i. ఇతర బ్యాంకర్లలోచైతన్యం కలిగించగల శక్తి (50% ప్రాముఖ్యం); ii. పరిష్కారాలు చూపుటలో తెలివి (25% ప్రాముఖ్యం); iii. వ్రాసిన విధానం, భాష, స్పష్టత (25% ప్రాముఖ్యం).
విజేతలకు యోగ్యతా పత్రాలతోబాటు నగదు బహుమతులు అందజేయబడతాయి:
ప్రథమ బహుమతి - ₹ 20, 000; ద్వితీయ బహుమతి - ₹ 15, 000;
తృతీయ బహుమతి - ₹ 10, 000
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/516 |