ఆగస్ట్ 31, 2016
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి. హైదరాబాద్ (తెలంగాణా) కు నిర్దేశాల జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రజలమేలుకై శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్‌కి కొన్ని నిర్దేశాలని జారీ చేయడం అవసరమని నిర్ణయించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A, సబ్ సెక్షన్ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, మరియు సెక్షన్ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, క్రింద శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, ఆగస్ట్ 29, 2016 పని ముగింపువేళ నుండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి పొందనిదే, ఈ క్రింద తెలిపిన మేరకు తప్ప-
అప్పులు, రుణాలు జారీ చేయరాదు మరియు నవీకరించరాదు: క్రొత్త పెట్టుబడులు పెట్టరాదు: అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపోజిట్లు అంగీకరించుటతో సహా, ఎటువంటి రుణభారము స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నెరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి, రాజీ, సర్దుబాటు ఒప్పందములు చేసుకొనరాదు; వారి ఆస్తులను, సంపత్తిని అమ్మరాదు, బదిలీ చేయరాదు - అని ఆదేశించింది.
-
పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, లేక ఏదేని పేరుతో పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి, డిపాజిటర్ కేవలం ₹ 1000/- మాత్రమే ఉపసంహరించుటకు అనుమతించవలెను. అయతే, డిపాజిటర్ ఏవిధంగానైనా బ్యాంకుకు రుణ పడి ఉంటే (అనగా రుణగ్రహీత/స్యూరిటీ) ఆ సొమ్ము మొదట రుణ ఖాతాలకు జమ చెయ్యాలి.
-
ప్రస్తుతం ఉన్న నిర్ణీతకాల డిపాజిట్లు అదే పేరుతో అదే హోదాలో, నవీకరించవచ్చు.
-
పై ఆదేశాల్లో అనుమతించిన మేరకు, వ్యయం చేయవచ్చు.
-
ప్రభుత్వ/SLRకు అమోదయోగ్యమైన సెక్యూరిటీలలో పెట్టుబడి చేయవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక అనుమతి లేనిదే ఏ ఇతర లయబిలిటీలు తీర్చరాదు.
పూర్తి ఆదేశాలు, ఆసక్తిగల ప్రజల సమాచారంకోసం, శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శింపబడ్డాయి. పరిస్థితులకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్దేశాల్లో మార్పులు చేయవచ్చు.
ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేవరకు, బ్యాంక్ కొన్ని నిబంధనలతో తమ కార్య కలాపాల్ని కొనసాగిస్తుంది. ఈ ఆదేశాలు, ఆగస్ట్ 29, 2016 పనివేళలు ముగింపునుంచి, ఆరు నెలలపాటు అమలులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన; 2016-2017/559 |