అక్టోబర్ 14, 2016
HBCL సహకార బ్యాంకు లి., లక్నో, ఉత్తరప్రదేశ్ కు జారీ చేసిన ఉత్తరువులను ఏప్రిల్ 15, 2017 వరకు కొనసాగించిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని HBCL సహకార బ్యాంకు లి.కు జారీ చేసిన ఉత్తరువులను మరో ఆరు నెలల పాటు అనగా అక్టోబర్ 16, 2016 నుంచి ఏప్రిల్ 15, 2017 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించింది. ఈ బ్యాంకు ఏప్రిల్ 10, 2015న బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A కింద జారీ చేసిన ఉత్తరువుల ప్రకారం ఏప్రిల్ 16, 2015న వ్యాపార కార్యకలాపాలు ముగిసినప్పటి నుంచి ఉత్తరువుల కింద ఉంది. పైన పేర్కొన్న ఉత్తరువులో మార్పులు చేసి దానిని అక్టోబర్ 15, 2016 వరకు పొడిగించారు. దానినే మళ్లీ అక్టోబర్ 07, 2016న జారీ చేసిన ఉత్తరువుల ద్వారా ఏప్రిల్ 15, 2017 వరకు పొడిగించడం జరిగింది. ఆ ఉత్తరువులోని ఇతర నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 07, 2016 నాటి ఆ ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది.
పరిస్థితులను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆ ఉత్తర్వులలో మార్పులు చేయవచ్చు.
అనిరుధ డి.జాదవ్
అసిస్టంట్ మేనేజర్
ప్రెస్ రిలీజ్ : 2016-17/928 |