అక్టోబర్ 14, 2016
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా, నగీనాకు చెందిన యునైటెడ్ ఇండియా సహకార బ్యాంక్ లిమిటెడ్ కు ఉత్తరువులు జారీ చేసిన RBI - ఉత్తరువుల ఉపసంహరణ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా, నగీనాకు చెందిన యునైటెడ్ ఇండియా సహకార బ్యాంక్ లిమిటెడ్ కు జులై 08, 2015న బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A రెడ్ విత్ సెక్షన్ 56, కింద ఉత్తరువులను జారీ చేసింది. ఆ ఉత్తరువులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలాంటి చివరి ఉత్తరువును మార్చి 30, 2016న జారీ చేశారు. అది అక్టోబర్ 14, 2016 వరకు అమలులో ఉంటుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A రెడ్ విత్ సెక్షన్ 56 ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను అనుసరించి ప్రజల ప్రయోజనార్థం అది అవసరమని భావిస్తూ, అక్టోబర్ 15,2016 నుంచి ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ జిల్లా, నగీనాకు చెందిన యునైటెడ్ ఇండియా సహకార బ్యాంక్ లిమిటెడ్ కు జారీ చేసిన ఆ ఉత్తరువులను (ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన) ఉపసంహరించుకుంటోంది.
ఆ ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇకపై బ్యాంకు తన సాధారణ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
అనిరుధ డి.జాదవ్
అసిస్టంట్ మేనేజర్
ప్రెస్ రిలీజ్ : 2016-17/929 |