అక్టోబర్ 18, 2016
NCFE నిర్వహించే NFLAT పరీక్షకు రిజిస్ట్రేషన్‌ల ప్రారంభం
(జాతీయ ఆర్ధిక అక్షరాస్యతా నిర్ధారణా పరిక్ష)
జాతీయ ఆర్ధిక విద్యా కార్యక్రమ కేంద్రం (NCFE) నిర్వహిస్తున్న జాతీయ ఆర్ధిక అక్షరాస్యతా నిర్ధారణా పరిక్ష (NFLAT ) రిజిస్ట్రేషన్ల నమోదు ఆక్టోబర్ 15, 2016 నుండీ ప్రారంభమయ్యింది. ఇందుకుగాను ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (NISM), నవీ ముంబై, 6 నుండి 10వ తరగతి విద్యార్థులందరూ ఈ పరీక్షలో (NCFE-NFLAT 2016-17) పాల్గొనాలని ఆహ్వానిస్తోంది.
ఈ పరీక్షను ఆన్ లైన్ ద్వారా ( తగిన ఐటీ సదుపాయాలు మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో), మరియు ఆఫ్ లైన్ లో (పాఠశాలల్లో పెన్ , పేపర్ ద్వారా) నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షను రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి NFLAT జూనియర్ (6వ తరగతి నుండే 8వ తరగతి వరకూ), NFLAT( 9 మరియు 10వ తరగతి ).
ఈ ప్రక్రియ కోసం పాఠశాలలు ఆన్ - లైన్ లో నమోదు చేసుకోవాలి. పాఠశాలల నమోదు తర్వాత ఆయా పాఠశాలలే పోటీలలో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేస్తాయి. పరీక్షా విధానం ఆన్ లైన్ / ఆఫ్ లైన్ అని ఎంపిక చేసుకునే అవకాశాన్ని పాఠశాలలకు కల్పిస్తారు. పాఠశాలలే తమ విద్యార్థుల ఆన్ లైన్ / ఆఫ్ లైన్ పరీక్షలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ / ఆఫ్ లైన్ పరీక్షల విషయంలో ఏదైనా సహాయం అవసరమైనట్లయితే NCFE/NSIM బృందం అందజేస్తారు.
ఆసక్తి గలిగిన పాఠశాలలు ఈ క్రింద పేర్కొన్న వెబ్ లింక్ పైన క్లిక్ చేసి NCFE వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు : http://www.ncfeindia.org/nflat
ముఖ్యమైన తేదీలు |
|
ఆన్ లైన్ టెస్ట్ |
ఆఫ్ లైన్ టెస్ట్ |
నమోదు ప్రక్రియ ప్రారంభం |
అక్టోబర్ 15, 2016 |
అక్టోబర్ 15, 2016 |
నమోదు ప్రక్రియ ముగింపు |
నవంబర్ 22, 2016 |
నవంబర్22, 2016 |
మొదటి స్థాయి- పరీక్ష తేదీ |
నవంబర్ 25, 2016 - జనవరి 7, 2017* |
డిసెంబర్1-డిసెంబర్ 10, 2016** |
రెండవ స్థాయి- ప్రాంతీయ & జాతీయ స్థాయి పోటీ |
ఫిబ్రవరి 1, 2017 నిండి ఫిబ్రవరి 28, 2017 |
* ఐటీ సదుపాయాలు మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో మాత్రమే ఆన్ లైన్ పరీక్ష నిర్వహింప బడుతుంది.
** ఆఫ్ -లైన్ పరీక్ష నమోదు చేసుకున్న పాఠశాలల్లో పెన్ను-పేపర్ ద్వారా పరీక్ష నిర్వహింపబడుతుంది. |
NFLAT మరియు NFLAT జూనియర్ పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో 75 మరియు 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ వివరాలు NCFE వెబ్ సైటులో అందుబాటులో ఉన్నాయి.
పురస్కారాలు :
జాతీయ స్థాయిలో గెలుపొందిన పాఠశాలలకు (మొదటి 3 స్థానాలు) ఒక్కొక్కరికీ రూ.35,000 చొప్పున నగదు బహుమతి, ఒక షీల్డ్ మరియు జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు (1+1 జంట) సర్టిఫికెట్లు, మెడల్ మరియు లాప్ టాప్ తో సత్కరించడం జరుగుతుంది.
ప్రాంతీయ పాఠశాలల విజేతలకు (ప్రతి జోన్‌లో మొదటి స్థానంలో నిలిచిన 3 పాఠశాలలు) ఒక్కొక్కరికీ రూ.25,000 రూపాయల చొప్పున నగదు బహుమతి, ఒక షీల్డ్ మరియు ప్రాంతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు (1+1 జంట) సర్టిఫికెట్లు, మెడల్ మరియు టాబ్లెట్స్/కిండెల్స్ తో సత్కరించడం జరుగుతుంది.
మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా :
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, NSIM భవన్, ప్లాట్ నెం. 82, సెక్టార్ -17, వాషి, నవీ ముంబై - 400703, ఫోన్:022-66734600-02.| ఈ మెయిల్ : nflat@nism.ac.in, వెబ్ సైట్ : www.ncfeindia.org | www.nism.ac.in
నేపథ్యం
జాతీయ ఆర్థిక విద్య వ్యూహాన్ని అమలు చేయడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (NISM)ను నోడల్ ఏజెన్సీగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో NISM దేశంలోని అన్ని ఆర్థిక రంగ రెగ్యులేటరీలు : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (IRDAI) మరియు పెన్షన్ ఫండ్ నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (PFRDA) లు కలిసి భాగస్వామ్య విధానంలో భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత మరియు ఆర్థిక సమ్మిళితం సాధించేందుకు జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం (NCFE) ను ఏర్పాటు చేసింది.
NCFE యొక్క జాతీయ ఆర్థిక అక్షరాస్యతా నిర్ధారణా పరీక్ష (NCFE-NFLAT) ఆ దిశగా ఒక ముందడుగు. ఒక జాతీయ స్థాయి పరీక్షను నిర్వహంచడం ద్వారా, NCFE పాఠశాల విద్యార్థులలో (6 నుంచి 10వ తరగతి) ప్రేరణ కల్పించి, వారు ఆర్థిక శాస్త్రపు భావనను అర్థం చేసుకోవడానికి, వారి ఆర్థిక అవగాహనను కొలవడానికి తోడ్పడి, తద్వారా వారు చిన్న వయసులోనే ముఖ్యమైన జీవన నైపుణ్యాలను అలవరచుకొని, భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/956 |