అక్టోబర్ 20, 2016
క్రెడిట్ అగ్రికోల్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఇండియా) కు జరిమానా విధించిన
భారతీయ రిజర్వ్ బ్యాంక్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 (A) (1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (i) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 6లోని అంశాలను ఉల్లంఘించినందుకుగాను క్రెడిట్ అగ్రికోల్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఇండియా) కు రూ.10 మిలియన్ల జరిమానా విధించింది.
ఈ బ్యాంకు పలు రకాల సేవలు అందిస్తూ తన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన క్రెడిట్ అగ్రికోల్ సీఐబీ సర్వీసెస్ ప్రై.లి. ద్వారా రుసుములు వసూలు చేస్తోంది. అయితే ఈ చర్యలు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 6 (1) క్రింద నిషిద్ధం కనుక బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 6 ను ఉల్లంఘించినందుకు ఆ బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఆ బ్యాంకు ఇచ్చిన జవాబును, వ్యక్తిగత వివరణలు, అందుబాటులో ఉన్న రికార్డులు నిశితంగా పరిశీలించిన పిమ్మట, ఆ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-17/979 |