Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (69.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 28/10/2016
ది దేవీ గాయ‌త్రి కో-ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ లిమిటెడ్‌, హైద‌రాబాద్‌, తెలంగాణ‌‌కు జ‌రిమానా విధించిన భార‌తీయ రిజర్వ్ బ్యాంక్

అక్టోబ‌ర్ 28, 2016

ది దేవీ గాయ‌త్రి కో-ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ లిమిటెడ్‌, హైద‌రాబాద్‌, తెలంగాణ‌‌కు జ‌రిమానా విధించిన భార‌తీయ రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 A (1) (b) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (సహకార బ్యాంకులకు వర్తించే) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, డైరెక్ట‌ర్లు మ‌రియు వారి బంధువుల‌కు రుణాలిచ్చే విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ సూచ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించినందుకు గాను ది దేవీ గాయ‌త్రి కో-ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ లిమిటెడ్‌ కు రూ.1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, దానికి ఆ బ్యాంకు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంకు ఇచ్చిన జవాబును పరిశీలించిన పిమ్మట, ఆ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

అజిత్ ప్ర‌సాద్‌
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-17/1062

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….