నవంబర్ 10, 2016
నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరచుకోనున్న చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు)
బ్యాంకులు ప్రజా కార్యకలాపాల ప్రయోజనార్థం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరచుకోనున్న నేపథ్యంలో, చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు) కూడా నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరవబడి ఉంటాయి. అందరు భాగస్వాములు/సభ్య బ్యాంకులు నవంబర్ 12, 13 తేదీలలో సాధరణ పని దినాలలో లాగే చెల్లింపుల వ్యవస్థలో తమ కస్టమర్ల కొరకు కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కోరడమైనది. బ్యాంకులు ఈ రెండు రోజులలో చెల్లింపు వ్యవస్థల సేవల లభ్యత గురించి తగిన ప్రచారం చేయగలరు.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1164 |