నవంబర్ 14, 2016
మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ బ్యాంకునోట్ల పంపిణీ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు –
ATMల రీకాలిబ్రేషన్ మరియు రీయాక్టివేషన్
1. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ లో భాగంగా కొత్త డిజైన్ లో ఎక్కువ విలువ కలిగిన (రూ.2000) నోట్లతో పాటు కొత్త డిజైన్ నోట్లను పంపిణీ చేయాల్సిన నేపథ్యంలో అన్ని ఏటీఎంలు/క్యాష్ హ్యాండ్లింగ్ మెషీన్లను రీకాలిబ్రేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
2. ప్రజల నగదు అవసరాలను తీర్చడంలో ఏటీఎంలు చాలా ముఖ్యపాత్రను నిర్వర్తిస్తున్నాయి. అంతే కాకుండా నగదు పంపిణీలో అవి కీలకంగా మారాయి. ఏటీఎంల రీయాక్టివేషన్ ద్వారా వినియోగదారులకు అనువైన సమయంలో, ప్రదేశంలో పెద్ద మరియు చిన్న మూల్యవర్గంలోని నోట్లను వారికి అందుబాటులోకి తీసుకురావడం, పంపిణీ చేయడం మరింత సులభతరమవుతుంది.
3. ఏటీఎంల రీకాలిబ్రేషన్‌లో బ్యాంకులు, ఏటీఎంలను తయారు చేసే సంస్థలు, భారత జాతీయ పేమెంట్ కార్పొరేషన్ (NCPI), స్విచ్ ఆపరేటర్లలాంటి పలు సంస్థలు పాలు పంచుకుంటాయి. రీకాలిబ్రేషన్ విషయంలో వీటన్నిటి మధ్య సమన్వయం అవసరం. అందువల్లే ఇది ఒక క్లిష్టమైన కార్యక్రమంగా మారింది.
4. ఈ నేపథ్యంలో రీకాలిబ్రేషన్ విషయంలో ఒక దిశ మరియు మార్గదర్శకత్వం కొరకు భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ శ్రీ ఎస్ ఎస్ ముంద్రా ఛైర్మన్ షిప్ కింద ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ లో :
i. భారత ప్రభుత్వపు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
ii. భారత ప్రభుత్వపు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
iii. భారత ప్రభుత్వపు హాం వ్యవహారాల శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
iv. దేశంలోని నాలుగు అతి పెద్ద ఏటీఎంల నెట్ వర్క్ కలిగిన బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ మరియు HDFC బ్యాంకుల సభ్యులు ప్రతినిదులుగా ఉంటారు.
v. NCPI ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
vi. డిపార్ట్ మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్ మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు.
vii. డిపార్ట్ మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ చీఫ్ జనరల్ మేనేజర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు.
5. టాస్క్ ఫోర్స్ కార్యాచరణ చర్చలకు ఏటీఎం ఆఫీస్ ఎక్విప్ మెంట్ తయారీదారులు (OEM), నిర్వాహక సర్వీస్ ప్రొవైడర్లు, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ (CIT) కంపెనీలు మరియు వైట్ లేబుల్ ఏటీఎం (WLA) ఆపరేటర్లకు చెందిన ఒక్కొక్క ప్రతినిధిని ఆహ్వానించడం జరుగుతుంది. అవసరమైతే టాస్క్ ఫోర్స్ ఇతరులను కూడా ఆహ్వానించవచ్చు.
6. టాస్క్ ఫోర్స్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ క్రింది విధంగా ఉంటాయి:
i. ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఏటీఎంలను వీలైనంత వేగంగా యాక్టివేట్ చేయడం.
ii. పై అంశానికి సంబంధించి ఏ ఇతర విషయమైనా
7. దీనికి అవసరమైన సెక్రటేరియల్ సహకారాన్ని DPSS, CO అందజేస్తారు.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1197 |