| DCCBలు తమ ప్రస్తుత కస్టమర్లు అకౌంట్ నుంచి రూ.24,000 వరకు విత్ డ్రా చేసుకునేందుకు వీలు కల్పించవచ్చు: RBI |
నవంబర్ 14. 2016
DCCBలు తమ ప్రస్తుత కస్టమర్లు అకౌంట్ నుంచి రూ.24,000 వరకు విత్ డ్రా చేసుకునేందుకు
వీలు కల్పించవచ్చు: RBI
భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBలు) తమ ప్రస్తుత కస్టమర్లు తమ అకౌంట్ల నుంచి నవంబర్ 24, 2016 వరకు వారానికి రూ.24,000 విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ బ్యాంకులు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు (రూ.500, రూ.1000) మార్పిడి కానీ, ఆ నోట్లను డిపాజిట్ చేసుకోవడం కానీ చేయరాదు. తదనుగుణంగా DCCBలు తమ అకౌంట్ల నుంచి తమ అవసరాలకు తగినంత నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు కల్పించాలని భారత రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకూ సూచించింది. వారానికి రూ.24,000 నగదు ఉపసంహరణ పరిమితి DCCBలు ఇతర బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవడానికి వర్తించదు.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1198 |
|