| ఏటీఎంల వినియోగం- కస్టమర్ ఛార్జీల రద్దు |
నవంబర్ 14. 2016
ఏటీఎంల వినియోగం- కస్టమర్ ఛార్జీల రద్దు
బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంకుల ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నిర్వహించే అన్ని లావాదేవీలపై (ఆర్థిక మరియు ఆర్థికేతర కార్యకలాపాలపై), నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు జరిపినప్పటికీ, కస్టమర్ ఛార్జీలను రద్దు చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు నిర్ణయించింది.
ఈ ఏటీఎంల వినియోగ ఛార్జీ రద్దు నవంబర్ 10, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 వరకు, సమీక్షకు లోబడి, అమలులో ఉంటుంది.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1199 |
|