నవంబర్ 08. 2016
మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్షరం ‘E’ కలిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ
భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ. 500 మూల్యవర్గంలో రెండు నెంబర్ ప్యానెళ్లలో ‘E’ అన్న ఇన్ సెట్ అక్షరం కలిగిన, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం ‘2016’ మరియు స్వచ్ఛ భారత్ లోగో ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్న బ్యాంకునోట్లను విడుదల చేస్తుంది.
ఈ కొత్త రూ.500 బ్యాంకు నోట్లు రంగు, పరిమాణం, థీమ్, భద్రతా లక్షణాలు మరియు డిజైన్ ఎలిమెంట్లు ఉండే చోటు పరంగా గతంలోని స్సెసిఫైడ్ బ్యాంకు నోట్ల (ఎన్‌బీఎన్) కన్నావిభిన్నమైనవి. ఈ నోట్ల ముఖ్య లక్షణాలు:
• ఈ నోట్ల సైజు 66 mm X 150 mm
• ఇవి రాతి బూడిద రంగులో ఉంటాయి.
• వెనుక భాగంలో భారతీయ జెండాతో కూడిన భారతీయ వారసత్వ కట్టడమైన ఎర్రకోట చిత్రం.
ఈ బ్యాంకు నోటుపై దృష్టిలోపం ఉన్నవారు వాటి విలువను గుర్తించేందుకు వీలుగా ఇంటాలియో ప్రింటింగ్‌లో ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం, అశోక స్థంభపు గుర్తు, బ్లీడ్ లైన్స్, కుడివైపున రూ.500తో కూడిన వృత్తము మరియు గుర్తింపు చిహ్నం ఉంటాయి.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1146 |